పంచెకట్టులో మహేష్ బాబు

బ్రహ్మోత్సవం…. సినిమా టైటిల్ నుంచే కొత్తదనాన్ని తీసుకొచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ లో కూడా అదే కొత్తదనాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 10న బ్రహ్మోత్సవం సినిమా పాటల్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. టైటిల్ కు తగ్గట్టు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను మొదట తిరుపతిలో సెలబ్రేట్ చేద్దామనుకున్నారు. కానీ ఎండలు మండిపోతున్న వేళ… .తిరుపతి కంటే హైదరాబాద్ బెటరని భావిస్తున్నారు. హైదరాబాద్ లోనే తిరుమలను ప్రతిబింబించేలా భారీ సెట్ ఏర్పాటుచేసి… నటీనటులందర్నీ సంప్రదాయంగా ముస్తాబుచేసి… ఆడియో ఫంక్షన్ పెట్టాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకు మహేష్ పంచెకట్టులో వస్తాడని తెలుస్తోంది. శ్రీమంతుడు సినిమా కోసం ఇప్పటికే మహేష్ లుంగీ కట్టాడు. సినిమాకు అది పెద్ద ఎట్రాక్షన్ అయికూర్చుంది. ఇప్పుడు బ్రహ్మోత్సవం కోసం ఏకంగా పంచె కట్టులో కనిపిస్తాడని తెలుస్తోంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాల్లో పంచెకట్టులో మెరిశారు. ఇప్పుడా మేజిక్ ను మహేష్ కూడా రిపీట్ చేయడానికి సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. 

Click on Image to Read:

kareena-kapoor1

anjali

kajal