ఎట్టకేలకు తేదీ ప్రకటించిన పవన్

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోపై మొన్నటివరకు సందిగ్దత ఉండేది. అసలు ఏ తేదీన నిర్వహిస్తారనేది ఒక డౌట్ అయితే… ఎక్కడ నిర్వహిస్తారనేది అతిపెద్ద డౌట్ గా ఉండేది.  ఫైనల్ గా ఈ అనుమానాలన్నింటిపై ఓ క్లారిటీ ఇచ్చాడు సర్దార్ నిర్మాత శరత్ మరార్. తమ కొత్త సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈనెల 20న గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు… ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. నిజానికి సర్దార్ ఆడియో ఫంక్ష న్ ను ఈనెల 18న అమరావతిలో నిర్వహించాలని మొదట అనుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన నుంచి పవన్ తప్పుకున్నట్టు తెలిసింది. అసలే షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉన్న కారణంగా…. అమరావతి ఆలోచన నుంచి పవన్ పక్కకు తప్పుకున్నాడు. దీంతో 20వ తేదీని హైదరాబాద్ లోనే ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్ లో వేదిక ఎక్కడనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేస్తారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.
Click on Image to Read:
chiru-pawan

bandla-ganesh

pawan

pawan-maruthi

sarinodu

chiru

sardar-gabbarsingh-1