Telugu Global
CRIME

అయిదేళ్ల పిల్లాడు అత్యాచారం చేశాడ‌ట‌!

కొన్ని విష‌యాల‌ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఇంగ్లండు న‌గ‌రం మాంచెస్ట‌ర్‌లో ఐదేళ్ల పిల్లాడు, 14ఏళ్ల బాలిక‌పై  అత్యాచారం చేశాడ‌నే కేసులో పోలీసులు విచారిస్తున్నారు. గ‌త సంవ‌త్స‌రంలో మొత్తం 70మంది ప‌దేళ్ల‌లోపు పిల్ల‌ల‌పై గ్రేట‌ర్ మాంచెస్ట‌ర్‌లో లైంగిక వేధింపుల కేసుల‌ను పోలీసులు న‌మోదు చేశారు.  ఇందులో 21 అత్యాచారం కేసులున్నాయి. అయితే వీరికి నేరానికి బాధ్య‌త వ‌హించే వ‌య‌సు లేదు క‌నుక వీరిని  కోర్టుకి హాజరుప‌ర‌చే వీలు లేదు. డైలీస్టార్ సండే అనే న్యూస్  […]

అయిదేళ్ల పిల్లాడు అత్యాచారం చేశాడ‌ట‌!
X

కొన్ని విష‌యాల‌ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఇంగ్లండు న‌గ‌రం మాంచెస్ట‌ర్‌లో ఐదేళ్ల పిల్లాడు, 14ఏళ్ల బాలిక‌పై అత్యాచారం చేశాడ‌నే కేసులో పోలీసులు విచారిస్తున్నారు. గ‌త సంవ‌త్స‌రంలో మొత్తం 70మంది ప‌దేళ్ల‌లోపు పిల్ల‌ల‌పై గ్రేట‌ర్ మాంచెస్ట‌ర్‌లో లైంగిక వేధింపుల కేసుల‌ను పోలీసులు న‌మోదు చేశారు. ఇందులో 21 అత్యాచారం కేసులున్నాయి. అయితే వీరికి నేరానికి బాధ్య‌త వ‌హించే వ‌య‌సు లేదు క‌నుక వీరిని కోర్టుకి హాజరుప‌ర‌చే వీలు లేదు.

డైలీస్టార్ సండే అనే న్యూస్ వెబ్‌సైట్ స‌మాచారాన్ని పొందే స్వేచ్ఛ కింద ఇంగ్లండు, వేల్స్‌ల్లో 4,584 నేరాలు పిల్ల‌ల‌మీద న‌మోద‌యి ఉన్నాయ‌నే స‌మాచారాన్ని పొంద‌గ‌లిగింది. ఈ నేర‌స్తుల్లో రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. బ్లేడ్ లేదా సూదిగా ఉన్న వ‌స్తువుల‌ను క‌లిగి ఉండ‌టం, వాటితో ఇత‌రుల‌మీద దాడిచేయ‌డం, బెదిరించ‌డం, చంపుతాన‌ని భ‌య‌పెట్ట‌డం, వెంట‌ప‌డ‌టం, అనుచిత ఫొటోలు తీయ‌డం, గంజాయి క‌లిగి ఉండ‌టం, లైంగిక వేధింపులు చేయ‌డం, తీవ్రంగా గాయ‌ప‌ర‌చ‌డం ఇవ‌న్నీ పిల్ల‌లు చేసిన నేరాల్లో ఉన్నాయి.

అయితే పిల్ల‌ల్లో క్రూర‌త్వాన్ని నివారించేందుకు కృషి చేస్తున్న నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ ద ప్రివెన్ష‌న్ ఆఫ్‌ క్రూయ‌ల్టీ టు చిల్డ్ర‌న్ అనే సంస్థ మాత్రం, పిల్ల‌ల నేర మ‌న‌స్త‌త్వంలో వారు త‌మ‌ని తాము హింసించుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటోంది. ఈ సంస్థ ప్ర‌తినిధి మాట్లాడుతూ చాలామంది చిన్న‌పిల్ల‌లు లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్న‌ట్టుగా తెలుస్తోంద‌ని, అయితే ఈ కేసుల్లో వారు పెరిగిన వాతావ‌ర‌ణాన్ని, వారి త‌ల్లిదండ్రుల బాధ్య‌తా రాహిత్యాన్ని ముఖ్యంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అంటున్నారు.

పిల్ల‌లు తాము ఏంచేస్తున్నారో తెలియ‌ని, అర్థం చేసుకోలేని వ‌య‌సులోనే అలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నారంటే ముందువారు అలాంటి నేరాలకు గుర‌యిన‌వారు, బాధితులు అయి ఉంటార‌ని మ‌నం గుర్తుంచుకోవాల‌ని ఆ ప్ర‌తినిధి అంటున్నారు. అందుకే పిల్ల‌ల్లో నేర ప్ర‌వృత్తిని త‌గ్గించాలంటే ముందు నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళ అయిన ఆ ప్ర‌తినిధి చెబుతున్నారు. ఇలాంటి పిల్ల‌ల‌కు నిపుణుల అండ‌దండ‌లు ఉండాల‌ని ఆమె అంటున్నారు.

ప్ర‌పంచం కుగ్రామ‌మై పోయిన త‌రుణంలో ఫ్యాష‌న్లు, సినిమాలు, చ‌దువులు, సాంకేతిక ప‌రిజ్ఞానం, వ‌స్తువులు, టెక్నాల‌జీ…వీట‌న్నింటితో పాటు వాటిని అంటిపెట్టుకుని ఉన్న ఎమోష‌న్లు, నేర‌మ‌న‌స్త‌త్వం, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌లేని త‌నం, విలాసాల ప‌ట్ల మోజు… ఇవ‌న్నీ కూడా చాలావేగంగా దిగుమ‌తి అవుతాయ‌ని గుర్తుంచుకుని, మ‌న‌మూ జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన స‌మ‌య‌మిది. ఏదిఏమైనా భార‌తీయ సంస్కృతి, జీవ‌న‌శైలి ఉన్న‌త‌మైన‌వ‌ని, అందులోని లోపాల‌ను స‌వరించుకున్నా, మంచిని మాత్రం వ‌దిలివేయ‌కూడ‌ద‌ని ఇలాంటి సంద‌ర్భాలు రుజువు చేస్తుంటాయి. మ‌నిషి లోప‌లి మృగం ఎప్ప‌టికీ అంతం కాదు కాబట్టి, మ‌నిషి నియ‌మ నిబంధ‌న‌ల మ‌ధ్య జీవించ‌డ‌మే ఉత్త‌మం!!!!

First Published:  14 March 2016 5:11 AM GMT
Next Story