Telugu Global
NEWS

వీరి శివతాండవం నాలుగు గోడల మధ్యే!

”ఇంకా ఎంతకాలం టీడీపీకి తోకపార్టీగా ఉండాలి?”. ”సొంతంగా ఎదగాలి. అవకాశాలను అందిపుచ్చుకుని సొంతకాళ్లపై ప్రభల శక్తిగా ఎదగాలి”. ఇదీ రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రంలో బీజేపీ నేతలు వినిపిస్తున్న స్లోగన్. కానీ ఇప్పటి వరకు టీడీపీ తోకను వదిలింది లేదు. ప్రభలశక్తిగా కాదు కదా కనీసం సొంతకాళ్లతో తప్పటడుగులు వేసిందీ లేదు. తాజాగా ఆదివారం విశాఖలో సమావేశమైన బీజేఎల్పీ సమావేశంలోనూ మరోసారి కమలనాయకులు భీకరగర్జనలుచేశారు. టీడీపీ దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. కేంద్రం రెండేళ్లలో లక్షా 40 వేల […]

వీరి శివతాండవం నాలుగు గోడల మధ్యే!
X

”ఇంకా ఎంతకాలం టీడీపీకి తోకపార్టీగా ఉండాలి?”. ”సొంతంగా ఎదగాలి. అవకాశాలను అందిపుచ్చుకుని సొంతకాళ్లపై ప్రభల శక్తిగా ఎదగాలి”. ఇదీ రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రంలో బీజేపీ నేతలు వినిపిస్తున్న స్లోగన్. కానీ ఇప్పటి వరకు టీడీపీ తోకను వదిలింది లేదు. ప్రభలశక్తిగా కాదు కదా కనీసం సొంతకాళ్లతో తప్పటడుగులు వేసిందీ లేదు. తాజాగా ఆదివారం విశాఖలో సమావేశమైన బీజేఎల్పీ సమావేశంలోనూ మరోసారి కమలనాయకులు భీకరగర్జనలుచేశారు.

టీడీపీ దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. కేంద్రం రెండేళ్లలో లక్షా 40 వేల కోట్లు ఇస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జనానికి చెప్పడం లేదని కమలనాథులు ఆగ్రహించారు. అసెంబ్లీ వేదికగా ప్రజల తరపున పోరాటం చేయాలని కూడా నిర్ణయించారు. వినడానికే ఈ ఆలోచనలు బాగానే ఉన్నాయి. కానీ అవి నిజరూపు దాల్చడం ఇప్పుడున్న బీజేపీ నేతలతీరుతో సాధ్యమా?. ఎందుకంటే కేంద్రం రూ. 1. 4 లక్షల కోట్లు ఇచ్చిందన్న విషయం అమిత్ షా వచ్చి రాజమండ్రిసభలో చెప్పేవరకు ఇక్కడి బీజేపీ నాయకత్వం కూడా ఆ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. చివరకు ఆ విషయం బీజేపీ కార్యకర్తలకే తెలియదు. బీజేపీ నేతలు అసెంబ్లీలో పోరాడుతామంటే అంతకన్నా కామెడీ ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుపై ఈగవాలకుండా చూసుకోవడంలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీగా ఉండిపోతున్నారు. అసెంబ్లీలో బీజేపీ విష్ణుకుమార్‌ రాజు పెద్ద మనిషి తరహాలో వ్యవహరించే ప్రయత్నం చేసినా చివరకు ఆయన టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నట్టుగా అనిపిస్తోంది.

ప్రభుత్వం చేసే తప్పులను విమర్శించకుండా రాజకీయం చేస్తే ఎన్ని దశాబ్దాలైనా సరే ఏ పార్టీ కూడా ఎదిగే అవకాశం ఉండదు. పైగా లోకల్‌ బీజేపీ లీడర్లు చంద్రబాబుపై గళమెత్తిన ప్రతిసారి వెంకయ్యనాయుడు ఏపీలో పర్యటించడం ”బాబు సూపర్” అని పొగిడేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. వెంకయ్య పొగడ్తల ముందు బీజేపీ సొంతకాళ్ల నడకచూడాలనుకునే వారి మాటలు గాల్లో కలిసిపోతున్నాయి. అంతెందుకు ఏపీ బీజేపీని శాసిస్తున్న నేతలంతా బాబు సామాజికవర్గం వారే. సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది కూడా బీజేపీలోని బాబుశ్రేయోభిలాషులే.

అలాంటప్పుడు… కొందరు అమాయకపు బీజేపీనేతలు ఆశిస్తున్నట్టు సొంతకాళ్లపై నడవడం, ప్రభలశక్తిగా ఎదగడం వంటివి అయ్యే పనులేనా?. నాలుగు గోడల మధ్య జరిగే సమావేశంలో కుమ్మేద్దామని నిర్ణయించుకోవడం… తీరా అసలు విషయానికి వచ్చేసరికి టీడీపీకి తోడుగా ఉండడం బీజేపీకి అలవాటుగా మారినట్టు అనిపిస్తుంది. బాబుతో సంబంధాలు నడుపుతున్న కమలనాయకులు బాగానే ఉన్నారు. ఎటొచ్చి ఏదో ఒకనాటికి బీజేపీ ఏపీలో పెద్ద పార్టీఅవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్న సామాన్య కార్యకర్తల పరిస్థితే పాపం అనిపిస్తోంది.

Click on Image to Read:

jagan-in-assembly

kejriwal

ysrcp-mla's

jagan

babu

ysrcp-tdp1

manmohansingh

ysrcp

reporters

vijaymalya

ysrcp1

jagan

jagan-case-involved

bjp-president

jagan-sakshi

First Published:  13 March 2016 11:38 PM GMT
Next Story