Telugu Global
NEWS

ఆపమని అడిగేలోపే ఘోరం...మెడికోల దుర్మరణం

విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి సుమారు పదకొండు గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కు చెందిన నలుగురు మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ మృతిచెందాడు.మరో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఉస్మానియా కాలేజ్‌కు చెందిన విద్యార్థులు 48 మంది స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనేందుకు నాలుగు రోజుల క్రితం అమలాపురం వెళ్లారు. సోమవారం ధనుంజయ ట్రావెల్స్‌కుచెందిన బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. […]

ఆపమని అడిగేలోపే ఘోరం...మెడికోల దుర్మరణం
X

విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి సుమారు పదకొండు గంటలకు ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కు చెందిన నలుగురు మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ మృతిచెందాడు.మరో 17 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఉస్మానియా కాలేజ్‌కు చెందిన విద్యార్థులు 48 మంది స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనేందుకు నాలుగు రోజుల క్రితం అమలాపురం వెళ్లారు. సోమవారం ధనుంజయ ట్రావెల్స్‌కుచెందిన బస్సులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో హాయ్‌ ల్యాండ్‌కు వెళ్లి వచ్చారు. అయితే డ్రైవర్ మద్యంసేవించి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని విద్యార్థులు ట్రావెల్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లారు. డ్రైవర్ ని మార్చాల్సిందిగా కోరారు. కానీ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని తెలుస్తోంది.

డ్రైవర్‌ వాహనాన్ని నడుపుతున్న తీరును గమనించిన విద్యార్థులు కొందరు బస్సు క్యాబిన్‌లోకి వెళ్లారు. బస్సును ఆపాల్సిందిగా కోరారు. అయినా డ్రైవర్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ సమయంలో డ్రైవర్‌, విద్యార్థుల మధ్య వాగ్వాదంజరిగినట్టు భావిస్తున్నారు. ఇంతలోనే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో చెట్టు కూడా విరిగిపడింది. బస్సు నుజ్జునుజ్జు అయింది. క్యాబిన్లోకి వెళ్లిన నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మిగిలిన విద్యార్థులు సీట్ల కింద ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు. మృతులను సరూర్‌నగర్‌కు చెందిన మచ్చాప్రణయ్, కుత్బుల్లాపూర్‌కు చెందిన విజయ్‌ తేజ, కరీంనగర్‌కు చెందిన ఉదయ్, ఆదిలాబాద్‌కు చెందిన గిరి లక్ష్మణ్, డ్రైవర్ వేముల శివయ్యగా గుర్తించారు. డ్రైవర్ మద్యంసేవించడం, ట్రావెల్ యాజమన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంపై సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు ప్రతిపక్ష నేత జగన్‌ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.

హైవేలమీదే మద్యం దుకాణాలకు అనుమతులివ్వడం, అడుగడుగున మద్యం లభించడం, మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు విపరీతంగా ప్రోత్సహించడం వల్ల ఎక్కువమంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. హైవేపై కనీసం అక్కడక్కడైనా డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తే ఇలాంటి ప్రమాదాలను కొన్నింటినైనా నివారించవచ్చు.

ముఖ్యంగా టోల్ గేట్ ల వద్ద బ్రీత్ అనలైజర్ టెస్టులను నిర్వహించడం చాలా సులువు. ఆచరణ సాధ్యం. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించడం మంచిది. లేకుంటే ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోతున్నాం.

Click on Image to Read:

ap-assembly

roja

kodela1

kodela

rabridevi

AIMIM

tdp-leaders

vishal-reddy

aachemnadiu

andhra-pradesh-assembly

jagan-in-assembly

ysrcp-mla's

ysrcp-party--anniversary

jagan

kejriwal

ysrcp-tdp1

babu

jagan

jagan-case-involved

bjp-tdp1

manmohansingh

First Published:  14 March 2016 11:19 PM GMT
Next Story