Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో పవన్

మొన్నటివరకు చిరంజీవి మేనరిజమ్స్, మెగాస్టార్ స్టెప్పుల్ని పవన్ కల్యాణ్ వాడుకునేవాడు. పవన్ ఒక్కడే కాదు…. మెగాఫ్యామిలీలో ప్రతి హీరో చిరంజీవి నామస్మరణ చేసినవాళ్లే. అయితే ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అయింది. చిరంజీవి 150వ సినిమాలో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడు. అంటే… ప్రత్యక్షంగా తెరపై కనిపిస్తాడని కాదు. చిరు 150వ సినిమాలో పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని డైలాగ్స్, అతని సినిమా క్లిప్స్ వాడుకుంటారట. వీవీ వినాయక్ ఈ మేరకు స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు […]

చిరంజీవి సినిమాలో పవన్
X
మొన్నటివరకు చిరంజీవి మేనరిజమ్స్, మెగాస్టార్ స్టెప్పుల్ని పవన్ కల్యాణ్ వాడుకునేవాడు. పవన్ ఒక్కడే కాదు…. మెగాఫ్యామిలీలో ప్రతి హీరో చిరంజీవి నామస్మరణ చేసినవాళ్లే. అయితే ఇప్పుడు ఈ సీన్ రివర్స్ అయింది. చిరంజీవి 150వ సినిమాలో పవన్ కల్యాణ్ కనిపించబోతున్నాడు. అంటే… ప్రత్యక్షంగా తెరపై కనిపిస్తాడని కాదు. చిరు 150వ సినిమాలో పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని డైలాగ్స్, అతని సినిమా క్లిప్స్ వాడుకుంటారట. వీవీ వినాయక్ ఈ మేరకు స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేశాడట. గతంలో వినాయక్ తీసిన నాయక్ సినిమాలో కూడా పవన్ కల్యాణ్ క్లిప్పింగ్స్ వాడుకున్నారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా అలాంటి కొన్ని సన్నివేశాలు జతచేయాలని వీవీ వినాయక్ అనుకుంటున్నాడట. ఈ ప్రతిపాదనకు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి 150వ సినిమా నిర్మాణ పనుల్ని కూడా పవన్ పర్యవేక్షిస్తాడనే టాక్ నడుస్తోంది.
Click on Image to Read:

Click on Image to Read:
sreya
suside
nayan
pawan
vishal-reddy
pawan
rajinikanth
samantha


First Published:  15 March 2016 9:06 AM GMT
Next Story