బీజేపీపై అన్నది ఒకదారి… తమ్ముడిది మరోదారి

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చెప్పినట్లు “భారత్‌ మాతా కీ జై” నినాదం నేను ప్రాణం పోయినా చేయనని, నా పీకమీద కత్తిపెట్టి చెప్పమన్నా చెప్పనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్న అసదుద్దీన్‌ ఒవైసీ ఈ విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల, బీజేపీ పట్ల నిప్పులు చెరుగుతుంటే తమ్ముడు అక్బరుద్దీన్‌ ఒవైసీ మాత్రం మొన్న జరిగిన హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల సభలలో ప్రసంగిస్తూ మేము బీజేపీతో కలిసి కాంగ్రెస్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు.

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎంఐఎం ఏమిటి, బీజేపీతో కలిసి పనిచేయడం ఏమిటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం అక్బరుద్దీన్‌ చెప్పిందే నిజమని మొన్నటి బీహార్‌ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలతో కలవకుండా స్వతంత్రంగా పోటీ చేయడం బీజేపికి మేలుచేయడంలో భాగమేనని, 2019లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఎంఐఎం దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ స్వతంత్రంగా పోటీ చేయవచ్చునని, అలా చేస్తే ప్రతిపక్షాలు తీవ్రంగా నష్టపోతాయని, బీజేపీ చాలా లాభపడుతుందని విశ్లేషిస్తున్నారు.

Click on Image to Read:

mla-anitha

cbn

ap-assembly

roja

kodela1

kodela

rabridevi

doctor-students

tdp-leaders

vishal-reddy

aachemnadiu

andhra-pradesh-assembly

jagan-in-assembly

ysrcp-mla's

ysrcp-party--anniversary

jagan

kejriwal

ysrcp-tdp1

babu

jagan

jagan-case-involved

bjp-tdp1

manmohansingh