Telugu Global
NEWS

మగాళ్లంటే ఎందుకంత ప్రేమ?

అసెంబ్లీ అంటే దేవాలయం. ఒకప్పుడు సభలో నేతల ప్రసంగాలు స్పూర్తిదాయకంగా ఉండేవి. సభలో మహనీయుల ప్రసంగాలకే ఆకర్షితులై రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో సభ అంత స్పూర్తిదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో పిల్లలు, మహిళలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి అసెంబ్లీ సమావేశాలను తిలకించడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చినట్టుగా ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మననేతలు వాడిన భాష చూసి జనం షాక్‌ అయ్యారు. సభలోనే కాకుండా బయట కూడా […]

మగాళ్లంటే ఎందుకంత ప్రేమ?
X

అసెంబ్లీ అంటే దేవాలయం. ఒకప్పుడు సభలో నేతల ప్రసంగాలు స్పూర్తిదాయకంగా ఉండేవి. సభలో మహనీయుల ప్రసంగాలకే ఆకర్షితులై రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో సభ అంత స్పూర్తిదాయకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో పిల్లలు, మహిళలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి అసెంబ్లీ సమావేశాలను తిలకించడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చినట్టుగా ఉంది.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మననేతలు వాడిన భాష చూసి జనం షాక్‌ అయ్యారు. సభలోనే కాకుండా బయట కూడా నేతల ప్రవర్తన ఇలాగే ఉంటోంది. ముఖ్యంగా అవకాశం దొరికిన ప్రతిసారి మహిళలను తక్కువచేసి మాట్లాడడం నేతలకు అలవాటుగా మారడం విషాదమే. అసెంబ్లీలో జగన్‌కు సవాల్ విసురుతూ మంత్రి అచ్చెన్నాయుడు” జగన్‌ కొవ్కెక్కిమాట్లాడుతున్నారు” అని అన్నారు. ఇంకో సందర్భంలో జగన్‌ మాగాడైతే,రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని అన్నారు. అంటే అవినీతి ఆరోపణలు రుజువు చేయడం మగవాళ్లకు మాత్రమే సాధ్యమని అచ్చెన్నాయుడు నమ్ముతున్నారు. మగతనం ముందు ఆడతనం ఎందుకు పనికి రాదని మంత్రిగారు అనుకుంటున్నారు. లేక మగాళ్లయితేనే సవాళ్లకు స్పందిస్తారు.. ఆడవాళ్లైతే సవాళ్లను పట్టించుకోకుండా వెళ్లిపోతారని అచ్చెన్న అభిప్రాయమా?. పౌరుషం అన్నది మగాడికి మాత్రమే ఉండే క్వాలిఫికేషన్‌ అనుకుంటున్నారా?. ఆడవాళ్లకు పౌరుషం ఉండదని నిర్దారణకు వచ్చారా?.

ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ”జగన్‌కు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారని కాబట్టి రెండో పెళ్లి చేసుకుని వీరభోగవసంతరాయుడి లాంటి కొడుకును కనాల్సిందిగా సలహా ఇచ్చాను” అని అన్నారు. అంటే ఆడపిల్లలు పనికి రారన్నది ఆదినారాయణరెడ్డి ఆలోచన కాబోలు. అసలు ఆడ పిల్ల పుట్టడమా లేక మగపిల్లాడు పుట్టడమా అన్నది మహిళ చేతిలో ఉండదని సైన్స్‌ చెబుతోంది. ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా ఆడపిల్లల పట్ల వివక్ష ప్రదర్శించవచ్చా?. ఇప్పటికీ దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధానుల జాబితాలో మహిళ అయిన ఇందిరాయే ముందున్న విషయం వీరికి గుర్తు లేదా?. వీరే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆడపిల్లలను చులకనచేస్తూ మీడియా సమావేశంలోనే మాట్లాడారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని సెలవిచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆడపిల్లల కన్నా మగపిల్లలే గొప్ప అన్న సందేశాన్ని ఇచ్చారు. మాటకు ముందు విజన్‌ 2020, విజన్ 2050 అని చెప్పే నేతలు … ఆడ మగ విషయంలో మాత్రం విజన్‌ కనబరచలేకపోవడం బాధాకరం.

Click on Image to Read:

nagrireddy-aadinarayana1

ap-government

ap-assembly

roja

kodela1

kodela

rabridevi

AIMIM

doctor-students

vishal-reddy

aachemnadiu

andhra-pradesh-assembly

jagan-in-assembly

ysrcp-mla's

ysrcp-party--anniversary

jagan

kejriwal

ysrcp-tdp1

babu

jagan

jagan-case-involved

bjp-tdp1

manmohansingh

First Published:  14 March 2016 10:21 PM GMT
Next Story