విష టీకా కనిపెట్టిన ఏపీ ప్రభుత్వం

కప్పల కన్నా ఘోరంగా ప్రజాప్రతినిధులు గోడలు దూకేస్తుంటే చూసి సిగ్గేసి పార్లమెంట్‌లో ఫిరాయింపుల నిరోధకచట్టానికి గతంలో పదును పెట్టారు. దాని ప్రకారం ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీకి అనుకూలంగా పనిచేసినా.. సొంత పార్టీ విప్‌ ధిక్కరించి వైరిపార్టీకి మద్దతు తెలిపినా పదవికి అనర్హులవుతారు. ఇది దేశంలో అమలవుతున్న చట్టం.

కానీ తెలుగుదేశం పాలన సాగుతున్న ఏపీలో మాత్రం ఫిరాయింపుల చట్టానికి చిల్లు కాదు ఏకంగా ఆ చట్టానికే పరోక్షంగా చెల్లు చీటి రాసేశారు. అది కూడా ప్రభుత్వం ప్రతిపాదించడం, స్పీకర్‌ మూజువాణి ఓటుతో ఒకే చెప్పడం ద్వారా విప్‌ అన్న పదానికి మరణశాసనం రాసేశారు. స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా ఇటీవల టీడీపీలోకి దూకేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఈ తెగింపుకు దిగింది. చట్టసభల్లో నిబంధనలను పెన్సిల్ రాతలను కొట్టేసినంత ఈజీగా రద్దు చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

శాసనసభ నిబంధన 71(2) సబ్‌ రూల్ 1 ప్రకారం అవిశ్వాసనోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత ఏరోజైనా దాన్ని చేపట్టాలి. 14 రోజుల తర్వాత ఆ నోటీసుకు కనీస సభ్యుల మద్దతు ఉందా లేదా అన్నది స్పీకర్ పరిశీలిస్తారు. కనీస సభ్యుల మద్దతు ఉంటే దానిపై లీవ్ గ్రాంట్ చేస్తారు. లీవ్ గ్రాంట్ అయిన రోజు నుంచి 10 రోజుల్లోగా తీర్మానంపై చర్చ చేపట్టాలని 72(3) చెబుతోంది. అంటే ఈ రెండు నిబంధనల ప్రకారం తీర్మానంపై చర్చకు 24 రోజుల గడువు దొరుకుతుంది. ఈ గడువు ముఖ్య ఉద్దేశం పార్టీ సభ్యులకు విప్ జారీ చేయడానికి కావాల్సినంత సమయం దొరికేలా చూడడం. సబ్జెక్టు పై ప్రీపేర్ అయ్యేందుకు అవకాశం ఇవ్వడం. ఈ రెండు నిబంధనలను ఫాలో అయితే వైసీపీకి విప్ జారీచేసే సమయం దొరుకుతుంది. అప్పుడు టీడీపీలోకి దూరిపోయిన ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభకు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది. సభకు రాకపోయినా అనర్హత వేటు పడుతుంది.

ఒకవేళ వారు సభకు వచ్చి టీడీపీకి అనుకూలంగా ఓటేస్తే అనర్హత ఖాయమైపోతుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిని కాపాడేందుకు ఏకంగా 71(2), 72(3) నిబంధనలను క్షణాల్లో ఒక తీర్మానం ద్వారా అధికారపక్షం తొలగించి వేసింది. అలా చేయడం ద్వారా 14 రోజులు,10 రోజుల గడువు నిబంధనలకు నీళ్లు వదిలేశారు. అప్పటికప్పుడు చర్చ ప్రారంభానికి అవకాశం ఇచ్చారు. అంటే ప్రతిపక్షం విప్ జారీచేసినా దాన్ని అందుకుని తాము సభకు వచ్చే సమయంలేకపోయిందని 8 మంది ఎమ్మెల్యేలు రొమ్ము చించుకుని చెప్పుకుంటారన్న మాట. అంతే కాదు ఇకపై విప్‌ అన్నదానికి అవకాశమే లేకుండా చేసేశారు.

ఇక పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు విప్ గండం అన్నది ఉండనే ఉండదు. విప్ గండమే లేనప్పుడు వారిపై అనర్హత అన్నప్రస్తావనే ఉండదు. భవిష్యత్తులో వైసీపీనుంచి మరి కొందరు ఎమ్మెల్యేలను అధికారపక్షం తీసుకున్నా… వైసీపీ మారోసారి అవిశ్వాసం పెట్టినా ఇప్పటిలాగే ఫిరాయింపుదారులను సభకు రాకుండా దాచిపెట్టి, విప్‌ జారీకి సమయం ఇవ్వకుండా నిబంధనలకు నీళ్లు వదిలేసి నీతులు మాత్రం చెప్పవచ్చన్న మాట. చట్టసభలపై గౌరవం తగ్గుతోంది అంటే… ఇలాంటి పనులు చేస్తే తగ్గక … హిమాలయం అంత ఎత్తుకు ఎదుగుతుందా?.

Click on Image to Read:

jagan-pressmeet

ysrcp-leader

jagan

jagan-chandrababu-kodela

Asaram-Bapu

raghul-gandhi

jagan

mla-anitha

prabhas

cbn

suside

nagrireddy-aadinarayana1

kodela1

ap-assembly

roja

 

kodela

tdp-leaders

rabridevi

AIMIM

doctor-students

vishal-reddy

aachemnadiu

andhra-pradesh-assembly

jagan-in-assembly

ysrcp-mla's

ysrcp-party--anniversary

jagan

kejriwal

ysrcp-tdp1

babu

bjp-tdp1