Telugu Global
National

ఆశారాం బాపూ లీల‌లు...ఇప్పుడు హ‌త్య‌ల ప‌థ‌కం!

ఆధ్యాత్మిక‌త పేరుతో ఎన్నో అకృత్యాల‌కు పాల్ప‌డి జైల్లో ఉన్న ఆశారాం బాపూ నేర చ‌రిత్ర మ‌రో మెట్టు పైకి ఎదిగింది. ఆశారాం ఆయ‌న కుమారుడు నారాయ‌ణ సాయి చేసిన నేరాలు, ఘోరాల‌ను క‌ళ్లారా చూసిన సాక్ష్యులు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కొక్క‌రుగా మ‌ర‌ణించ‌డం తెలిసిందే. సినిమాటిక్‌గా సాక్ష్యులు ఒక్కొక్క‌రే  అంతం కావ‌డం వెనుక ఉన్న‌ది ఆశారాం బాపూనే అని ఇప్ప‌టికే పెద్దఎత్తున ఆరోప‌ణ‌లు అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో ఆ ఆరోప‌ణ‌లు నిజాలేన‌ని ఇప్పుడు వెల్ల‌డైంది. ఆశారాం ఆదేశం మేర‌కే తాను […]

ఆశారాం బాపూ లీల‌లు...ఇప్పుడు హ‌త్య‌ల ప‌థ‌కం!
X

ఆధ్యాత్మిక‌త పేరుతో ఎన్నో అకృత్యాల‌కు పాల్ప‌డి జైల్లో ఉన్న ఆశారాం బాపూ నేర చ‌రిత్ర మ‌రో మెట్టు పైకి ఎదిగింది. ఆశారాం ఆయ‌న కుమారుడు నారాయ‌ణ సాయి చేసిన నేరాలు, ఘోరాల‌ను క‌ళ్లారా చూసిన సాక్ష్యులు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కొక్క‌రుగా మ‌ర‌ణించ‌డం తెలిసిందే. సినిమాటిక్‌గా సాక్ష్యులు ఒక్కొక్క‌రే అంతం కావ‌డం వెనుక ఉన్న‌ది ఆశారాం బాపూనే అని ఇప్ప‌టికే పెద్దఎత్తున ఆరోప‌ణ‌లు అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో ఆ ఆరోప‌ణ‌లు నిజాలేన‌ని ఇప్పుడు వెల్ల‌డైంది. ఆశారాం ఆదేశం మేర‌కే తాను సాక్ష్యుల హ‌త్య‌లు చేశాన‌ని షార్ప్ షూట‌ర్ కార్తీక్ ఉర‌ఫ్ రాజు దులాల్ చంద్ హ‌ల్దార్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఆశారాం, ఆయ‌న కుమారుడు నారాయ‌ణ సాయిల‌కు వ్య‌తిరేకంగా నోరువిప్పిన వారిపై ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు దాడులు, హ‌త్య‌లు జ‌రిగాయి. 16 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో ఆశారాం బాపు రెండేళ్లుగా జైల్లో ఉంటున్నాడు. ప‌దేప‌దే బెయిల్‌ కోసం దరఖాస్తు చేస్తున్నా కోర్టులు తిర‌స్క‌రిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆశారాం త‌న‌కు వ్య‌తిరేకంగా సాక్ష్యం చెబుతున్న వారంద‌రినీ హ‌త‌మార్చే దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక ఒకటి వేశాడు.

సాక్ష్యుల అంతానికి షార్ప్ షూట‌ర్
ఇప్పటి వరకు తాను ఆశారాంకు వ్యతిరేకంగా కోర్టుల్లో నోరు తెరిచిన ముగ్గురిని చంపేశానని షార్ప్‌ షూటర్‌ కార్తీక్‌ పోలీసులు ముందు ఒప్పుకున్నాడు.ఆ ముగ్గురే కాకుండా మరి కొందరిని చంపేయటానికి త‌న‌కు ఆదేశాలున్నాయని కూడా చెప్పాడు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రారుపూర్‌ పోలీసులు ఆతడిని అదుపులోకి తీసుకున్నారు. రారుపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్తీక్‌ రెండేండ్ల నుంచి వాంటెడ్‌ లిస్టులో ఉన్నాడు. రెండు నెలల ముందు తన భార్యను రారుపూర్‌ పంపించాడు. అక్కడ పహందా గ్రామంలో ఓ అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు. కార్తీక్‌ భార్య‌పై నిఘా పెట్టిన పోలీసులు అత‌డిని ప‌ట్టుకున్నారు. కార్తీక్ ప‌ట్టుబ‌డినా, ఆశారాం బాపూకి పోలీసుల్లో స‌హ‌క‌రించేవారు ఉన్నార‌నే అనుమానంతో ఆ విష‌యాన్ని గోప్యంగా ఉంచారు. కార్తీక్ ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. అత‌నికి ఆశారాం శిష్యుడైన డాక్టర్‌ విష్ణుబంధు రంజిత్ స‌హ‌క‌రిస్తున్న‌ట్టుగా పోలీసులు గుర్తించారు. కార్తీక్ నుండి పది తుపాకులు, మూడు 12 బోర్‌ గ‌న్‌లు, 9ఎంఎం పిస్టోల్‌, 94 తూటాలతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

స‌న్నిహితుల‌నే అంతం చేయించాడు
2013లో ఆశారాంకు వ్య‌తిరేకంగా తొలిసారి గుజరాత్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అఖిల్ గుప్తా 2015లో హ‌త్య‌కు గురయ్యాడు. వ్యక్తిగత సహాయకుడు అఖిల్‌ గుప్తా గుజరాత్‌ పోలీసుల ముందు ఆశారాం గురించి ఫిర్యాదు చేశారు. అలానే మరో వ్యక్తిగత సహాయకుడు మహేంద్ర చావ్లాను కూడా అంతమొందించారు. కాగా అంతకన్నా రెండేండ్ల ముందు లాలా ఠాకూర్‌ను చంపేశారు. 2009 డిసెంబర్‌ నెలలో ఆశారాం ఆశ్రమంలో అతని పాత అనుచరుడు రాజు చాండక్‌ను, ఛింద్‌వాడలో ఆశారాం ఆశ్రమ వార్డెన్‌ ఓం ప్రకాశ్‌ ప్రజాపతి, అతని భార్యను చంపేశారు. ఆశారాం కు వ్యతిరేకంగా నోరు విప్పినందుకు ఆశ్రమంలో ఉన్న ఇద్దరు చిన్నారులపై కూడా తూటాలతో దాడిచేశారు. ఆశారాం సహచరుడైన ఆయుర్వేద డాక్టర్ అమృత్‌ ప్రజాపతిని 2014లో కాల్పులు జరిపి అతి కిరాతకంగా హత్య చేశారు. ప్రజాపతి ఆశారాం ఆశ్రమంలో వైద్యం అందించేవారు. అయితే ఆ తర్వాత విబేధించి బయటకొచ్చి ప్రధాన సాక్షిగా మారారు. 2015 జులైలో షాజాపూర్‌లో 35 ఏండ్ల క్రిపాల్‌ సిన్హా కూడా ఆశారాం షార్ప్‌ షూటర్ల తూటాలకు బలయ్యాడు. అతను ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తుండేవాడు. ఆ కంపెనీ యజమాని కుమార్తెపై ఆశారాం లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో క్రిపాల్‌ సిన్హా సాక్షిగా ఉన్నాడు. ఆశారాం బాపు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన ఒక మహిళ (33) గుజరాత్‌లో తన భర్త, కొడుకుతో సహా 2014లో అదృశ్యమైంది. మరో సాక్షిపై ఆసిడ్‌ దాడి జరిగింది. ఇవ‌న్నీ కాకుండా 2008లో గుజరాత్‌లో ఆశారామ్‌కు చెందిన ఆశ్రమపాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.

కోడ‌లిపైనా హింస‌…
భర్త, మామ నిత్యం తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని ఆశారాం బాపు కోడలు జానకి పోలీసులకు ఫిర్యాదు చేసి వాంగ్మూలం ఇచ్చింది. తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని జానకి పోలీసులకు తెలిపింది. వ్య‌తిరేకించిన త‌న‌ను చీక‌టికొట్లో వేశార‌ని ఆమె ఆరోపించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా లెక్కించిన ఆశారాం సంపద విలువ 2014 జనవరి 30 నాటి లెక్క‌ల ప్ర‌కారం దాదాపు రూ. 10 వేల కోట్లు.

Click on Image to Read:

jagan-pressmeet

ysrcp-leader

jagan

jagan-chandrababu-kodela

jagan

raghul-gandhi

mla-anitha

prabhas

cbn

suside

nagrireddy-aadinarayana1

ap-government

kodela1

ap-assembly

roja

kodela

tdp-leaders

rabridevi

AIMIM

doctor-students

vishal-reddy

ysrcp-party--anniversary

First Published:  16 March 2016 3:21 AM GMT
Next Story