ప్రభాస్ సోదరుడు ఏడాది జైలులో ఉండాల్సిందేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సోదరుడికి జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో రాజేంద్రనగర్‌ కోర్టు ప్రభాస్ సోదరుడు ప్రభోద్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. రెండు నెలల వ్యవధిలో బాధితుడికి రూ. 80 లక్షలు చెల్లించాలని కూడా ఆదేశించింది. ప్రభాస్ హీరోగా ప్రభోద్ బిల్లా సినిమా తీశారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి ప్రభోద్ రూ. 43 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాల్సిందిగా వ్యాపారి ఒత్తిడి తేవడంతో ప్రభోద్ రూ. 43 లక్షలకు చెక్ ఇచ్చారు. అది బ్యాంకులో బౌన్స్ అయింది. విషయాన్ని ప్రభోద్ దృష్టికి తీసుకెళ్లగా పలుమార్లు చెక్కులు ఇచ్చారని అవి కూడా బౌన్స్ అయ్యాయని వ్యాపారి చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభోద్‌కు జైలు శిక్షతో పాటు రెండు నెలల్లో రూ. 80 లక్షలు చెల్లించాల్సిందిగా రాజేంద్రనగర్‌ కోర్టు తీర్పు చెప్పింది. అయితే జైలు శిక్ష విషయంలో పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ తమకు తప్పకుండా ఊరట లభిస్తుందని ప్రభోద్ భావిస్తున్నారు.

Click on Image to Read:
sreya
nayan
suside
pawan
chiru-pawan
vishal-reddy
pawan
rajinikanth
samantha