Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి కోసం కాదట... వినాయక్ కోసమట....

చిరంజీవి 150వ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుందనే విషయాన్ని మనం చాలా రోజుల కిందటే చెప్పుకున్నాం. తాజాగా ఆ విషయాన్ని మేకర్స్ కూడా కన్ ఫర్మ్ చేశారు. ఇదిలాఉండగా… ఈ సినిమాలో నయనతార నటించడానికి కారణం చిరంజీవి కాదట… అలా అని ఆమెకిచ్చిన భారీ పారితోషికం కూడా కాదట. కేవలం దర్శకుడు వీవీ వినాయక్ కోసమే 150వ సినిమాలో నటించడానికి నయన్ ఒప్పుకుందట. కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అదే నిజం అంటున్నారు చాలామంది. ఈమధ్య కాలంలో […]

చిరంజీవి కోసం కాదట... వినాయక్ కోసమట....
X
చిరంజీవి 150వ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనుందనే విషయాన్ని మనం చాలా రోజుల కిందటే చెప్పుకున్నాం. తాజాగా ఆ విషయాన్ని మేకర్స్ కూడా కన్ ఫర్మ్ చేశారు. ఇదిలాఉండగా… ఈ సినిమాలో నయనతార నటించడానికి కారణం చిరంజీవి కాదట… అలా అని ఆమెకిచ్చిన భారీ పారితోషికం కూడా కాదట. కేవలం దర్శకుడు వీవీ వినాయక్ కోసమే 150వ సినిమాలో నటించడానికి నయన్ ఒప్పుకుందట. కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అదే నిజం అంటున్నారు చాలామంది. ఈమధ్య కాలంలో వరుసగా ఫ్లాపులిస్తున్న వినాయక్… సెంటిమెంట్ కోసం నయనతారను మరోసారి హీరోయిన్ గా తీసుకున్నాడట. వినాయక్-నయన్ కాంబోలో వచ్చిన అదుర్స్, లక్ష్మి సినిమాలు రెండూ మంచి విజయాన్నందుకున్నాయి. ప్రభాస్ తో చేసిన యోగి సినిమా పెద్దగా ఆడకపోయినా వినాయక్ కెరీర్ కు మాత్రం అది ప్లస్సే అయింది. అందుకే చిరంజీవి సినిమాకు నయనతారనే తీసుకుందామని పట్టుబట్టి మరీ సాధించుకున్నాడట వినాయక్.
Click on Image to Read:
sreya
suside
pawan
chiru-pawan
vishal-reddy
pawan
rajinikanth
samantha
First Published:  15 March 2016 9:13 PM GMT
Next Story