పనిపూర్తిచేసిన సరైనోడు

సరైనోడు సినిమాను నాన్ స్టాప్ గా ఫినిష్ చేశాడు బన్నీ. బొలీవియాలో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఓ సాంగ్ షూటింగ్ కోసం ఈమధ్యే బొలీవియా వెళ్లి హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని ప్రకటించింది. సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సాఫ్ట్ మూవీ తర్వాత బన్నీ చేస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్ టైనర్ సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ…. మే లో మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో ఆడియో ఫంక్షన్ ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. సరైనోడు సినిమాలో బన్నీ సరసన ఫస్ట్ టైమ్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇద్దరమ్మాయిలతో సినిమాలో బన్నీతో కలిసి పనిచేసిన క్యాథరీన్ కూడా సరైనోడు లో ఉంది. మరో హీరో ఆది పినిశెట్టి ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయం అవుతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
Click on Image to Read:
sreya
pawan
prabhas
chiru-pawan
nayan
tamanna
suside
pawan
rajinikanth
samantha