అప్పట్లో ఆ హీరోతో చేయనందుకు బాధపడిందట‌

స్టార్ హీరోయిన్స్ కు ఖాలీగా ఉండే డేట్స్ దొరకటం చాలా కష్టమే. అయితే అదే స‌మ‌యంలో స్టార్ హీరోస్ లేదా స్టార్ డైరెక్టర్స్ దర్శకత్వంలో ఎన్నో ఆఫ‌ర్స్ వ‌స్తుంటాయి. అయితే డేట్స్ అన్ని చిత్రాల‌కు అడ్జెస్ట్ చేయ‌లేక… కొన్ని ప్రాజెక్ట్ లు వ‌దులుకోక త‌ప్పుదు. అలాగే ప్ర‌భాస్ న‌టించిన మిష్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ చిత్రంలో హీరోయిన్ కోసం ఫ‌స్ట్ తమన్నాకే ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక వ‌ద‌లుకుంద‌ట‌. ద‌శ‌ర‌థ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. హీరోయిన్ గా చేసిన కాజ‌ల్ కు మంచి పేరు వ‌చ్చింది. అంత మంచి సినిమా వ‌దులుకున్నంద‌కు త‌మ‌న్నా బాధ ప‌డింద‌ట‌. త‌న‌కు బాగా న‌చ్చిన చిత్రాల్లో అదొక‌ట‌ని ఈ మ‌ధ్య ఒక ఇంట‌ర్వూలో తమన్నా అలా మనస్సు లో బాధను బయటపెట్టింది.