Telugu Global
National

గుర్రం కాలు విర‌గ్గొట్టిన నేరం...యాభై రూపాయ‌ల జ‌రిమానాతో చెల్లు!

డెహ్రాడూన్‌లో పోలీస్ అశ్వం శ‌క్తిమాన్ మీద అమానుషంగా దాడిచేసి, కాలు విర‌గ్గొట్టిన‌ బిజెపి శాస‌న‌స‌భ్యుడు గ‌ణేష్ జోషిని పోలీసులు ఈ రోజు ఉద‌యం అరెస్టు చేశారు. ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి హ‌రీష్ రావ‌త్ నిధుల‌ను దుర్వినియోగం చేశారంటూ బిజెపి పార్టీవారు నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో ఆ పార్టీ శాస‌న స‌భ్యుడు గ‌ణేష్ జోషి, క‌ర్ర‌తో శ‌క్తిమాన్ అనే ఆ గుర్రాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా బాదేశాడు. టివి న్యూస్ ఛాన‌ళ్ల‌లో గుర్రంపై ఆయ‌న చూపిన ప్ర‌తాపం స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌త ఆదివారం […]

గుర్రం కాలు విర‌గ్గొట్టిన నేరం...యాభై రూపాయ‌ల జ‌రిమానాతో చెల్లు!
X

డెహ్రాడూన్‌లో పోలీస్ అశ్వం శ‌క్తిమాన్ మీద అమానుషంగా దాడిచేసి, కాలు విర‌గ్గొట్టిన‌ బిజెపి శాస‌న‌స‌భ్యుడు గ‌ణేష్ జోషిని పోలీసులు ఈ రోజు ఉద‌యం అరెస్టు చేశారు. ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి హ‌రీష్ రావ‌త్ నిధుల‌ను దుర్వినియోగం చేశారంటూ బిజెపి పార్టీవారు నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో ఆ పార్టీ శాస‌న స‌భ్యుడు గ‌ణేష్ జోషి, క‌ర్ర‌తో శ‌క్తిమాన్ అనే ఆ గుర్రాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా బాదేశాడు. టివి న్యూస్ ఛాన‌ళ్ల‌లో గుర్రంపై ఆయ‌న చూపిన ప్ర‌తాపం స్ప‌ష్టంగా క‌నిపించింది. గ‌త ఆదివారం గ‌ణేష్ జోషిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆయ‌న‌ను ఈ రోజు ఉద‌యం ఒక హోటల్లో అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే దాడిలో శ‌క్తిమాన్ ఎడ‌మ వెనుక‌ కాలు చాలాచోట్ల విరిగింది. దాన్ని తొల‌గించ‌పోతే గుర్రం ప్రాణాలు పోయే ప‌రిస్థితి రావ‌డంతో ప‌ది మంది డాక్ట‌ర్ల బృందం ఆ కాలుని తొల‌గించింది.

shaktiman-horse-after-surgery_650x400_41458274360అయితే ఇదిలా ఉంటే అరెస్టు అయిన శాస‌న‌స‌భ్యుడికి కోర్టు యాబై రూపాయ‌ల జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. జంతు హ‌క్కుల సంర‌క్ష‌ణ‌, వాటిపై హింస‌, క్రూర‌త్వ చ‌ర్య‌ల‌ను నివారించే చ‌ట్టం 1960 ప్ర‌కారం, శ‌క్తిమాన్‌పై అమానుష హింస‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేకి యాభై రూపాయ‌లు జ‌రిమానా మాత్ర‌మే విధించే అవ‌కాశం ఉంద‌ని జంతు సంర‌క్ష‌ణా కార్య‌క‌ర్త ఒక‌రు తెలిపారు. ఒక‌వేళ అదే హింస‌కు తిరిగి పాల్ప‌డితే ఆ వ్య‌క్తికి 100 రూపాయ‌లు జ‌రిమానా లేదా మూడునెల‌ల కారాగారం…లేదా రెండూ విధించే అవ‌కాశం ఉంద‌ని ఆ కార్య‌క‌ర్త తెలిపారు.

కాంగ్రెస్, బిజెపి రెండు ప్ర‌భుత్వాలు జంతు సంర‌క్ష‌ణ విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, క‌నీసం ఈ జ‌రిమానాల‌ను పెంచే విష‌యంలో కూడా చ‌ట్టానికి ఎలాంటి స‌వ‌ర‌ణ‌లు చేయ‌లేద‌ని ఆ కార్య‌క‌ర్త విమ‌ర్శించారు. జంతువుల‌పై హింస‌ని పీన‌ల్‌కోడ్ చ‌ట్టాలు తీవ్రంగా ప‌రిగ‌ణించ‌డం లేద‌ని, వాటిని ఉపేక్షించ‌ద‌గిన నేరాలుగా చ‌ట్టాలు భావిస్తున్నాయ‌ని పీపుల్ ఫ‌ర్ యానిమ‌ల్స్ ప్ర‌తినిధి గౌరీ మౌలేఖి అన్నారు.

ఇటీవ‌ల రెండు ట్ర‌క్కుల ఒంటె మాంసాన్ని మేవాట్ ద‌గ్గ‌ర పోలీసులు ప‌ట్టుకున్నార‌ని, అయితే అందుకు ప‌రిహారంగా నేర‌స్తులు కేవ‌లం 100 రూపాయ‌లు జ‌రిమానాతో బ‌య‌ట‌ప‌డ్డార‌ని గౌరి తెలిపారు. జంతుహింస‌కి పాల్ప‌డుతున్న‌వారిలో రెండు శాతం మంది మాత్ర‌మే ప‌ట్టుబ‌డుతున్నార‌ని ఆమె అన్నారు. అంతేకాదు, ఎక్కువ పాలు పిండుకోవాల‌నే దురాశ‌తో ఆక్సిటోసిన్‌ని గేదెలు, ఆవుల మీద ప్ర‌యోగిస్తున్న నేరం కూడా ఈ 50 రూపాయ‌ల జ‌రిమానా ప‌రిధిలోనే ఉంద‌ని గౌరి అన్నారు. అయితే 2011లో జంతు సంర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌నే చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేసినా అది అమ‌ల్లోకి రాలేదు. ఇందులో జంతుహింస‌కు 25వేల జ‌రిమానా లేదా రెండేళ్ల జైలు..లేదా రెండూ విధించాల‌ని ఉంది. అలాగే అదేనేరాన్ని మ‌ళ్లీ చేస్తే ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా, మూడేళ్ల జైలు విధించ‌వ‌చ్చు. అయితే ఇందులో ఉన్న క‌ఠిన‌మైన క్లాసుల‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని తిరిగి ప‌రిశీలించాల‌నే ఉద్దేశంతో ఆపారు.

Click on Image to Read:

roja-vishnu

jagan

jagan-ktr

ysrcp-notice

roja-chandrababu

jagan

roja-rajbhavan

kejriwal

roja1

dustbin

lokesh twitter

roja

speakar-kodela

jagan-roja

RSS

kodela-chandrababu-naidu-ya

narayana-vishnu

roja1

roja

jagan-pressmeet

First Published:  18 March 2016 1:50 AM GMT
Next Story