Telugu Global
CRIME

ప‌దిహేనేళ్ల బాలిక‌పై ప్రేమోన్మాది కాల్పులు!

త‌న‌ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేద‌నే ఆగ్ర‌హంతో ఓ ఉన్మాది ప‌దిహేనేళ్ల అమ్మాయిని తుపాకితో కాల్చేశాడు. ముంబ‌యిలో ఈ దారుణం చోబుచేసుకుంది. మ‌మ‌త మోర్యా ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. క‌మ‌లాకాంత్ షైనీ (19) ఆమెకు దూర‌పు బంధువు అవుతాడు. ఒక పెళ్లిలో అత‌ను మ‌మ‌త కుటుంబాన్ని మూడునెల‌ల క్రితం క‌లిశాడు. త‌రువాత రైల్వే ప‌రీక్ష‌కోసం వ‌చ్చాన‌ని నాట‌కం అడుతూ మ‌మ‌త వాళ్లింటికి వ‌చ్చాడు.  ఆ త‌రువాత త‌న‌కు ఉద్యోగం కావాలంటూ మ‌మ‌త తండ్రిని అడిగి, అది కూడా స‌మ‌కూర్చున్నాడు. […]

ప‌దిహేనేళ్ల బాలిక‌పై ప్రేమోన్మాది కాల్పులు!
X

త‌న‌ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేద‌నే ఆగ్ర‌హంతో ఓ ఉన్మాది ప‌దిహేనేళ్ల అమ్మాయిని తుపాకితో కాల్చేశాడు. ముంబ‌యిలో ఈ దారుణం చోబుచేసుకుంది. మ‌మ‌త మోర్యా ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. క‌మ‌లాకాంత్ షైనీ (19) ఆమెకు దూర‌పు బంధువు అవుతాడు. ఒక పెళ్లిలో అత‌ను మ‌మ‌త కుటుంబాన్ని మూడునెల‌ల క్రితం క‌లిశాడు. త‌రువాత రైల్వే ప‌రీక్ష‌కోసం వ‌చ్చాన‌ని నాట‌కం అడుతూ మ‌మ‌త వాళ్లింటికి వ‌చ్చాడు. ఆ త‌రువాత త‌న‌కు ఉద్యోగం కావాలంటూ మ‌మ‌త తండ్రిని అడిగి, అది కూడా స‌మ‌కూర్చున్నాడు. ఆపై మ‌మ‌త వెంట‌బ‌డి త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని వేధించ‌డం మొద‌లుపెట్టాడు. అందుకు మ‌మ‌త ఒప్పుకోక‌పోవ‌డంతో శుక్ర‌వారం అత‌ను ఒక పిస్ట‌ల్‌తో ఇంటికి వ‌చ్చాడు. తిరిగి ఇద్ద‌రిమ‌ధ్య వాద‌న చోటుచేసుకుంది. మ‌మ‌త నిరాక‌ర‌ణ‌ని ఒప్పుకోలేని ఫైనీ ఉన్మాదంతో ఆమె మొహంమీద పిస్ట‌ల్‌తో కాల్చాడు. తుపాకి గుండు మ‌మ‌త కుడి ద‌వ‌డ‌నుండి ఎడ‌మ కంటివ‌ర‌కు దూసుకుపోయింది. మ‌మ‌తకు కెఇఎమ్ హాస్ప‌ట‌ల్లో 20మందితో కూడిన డాక్ట‌ర్ల బృందం ఆప‌రేష‌న్ చేసింది. కుడి ద‌వ‌డ నుండి దూసుకుపోయిన బుల్లెట్ ఎడ‌మ కంటికి కింది భాగంలో ఇరుక్కుపోయింది. వైద్యులు దానిని తొల‌గించారు. అయితే ఆమె ఎడ‌మ‌క‌న్ను ప‌నిచేస్తుందా లేదా అన్న విష‌యంపై డాక్ట‌ర్లు ఇంకా ఏమీ చెప్ప‌లేక‌పోతున్నారు.

ప్ర‌స్తుతం ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్న మ‌మ‌త ఈ సంఘ‌ట‌న కార‌ణంగా మ‌రికొన్ని ప‌రీక్ష‌ల‌ను రాయ‌లేక‌పోతున్న‌ది. త‌న‌కున్న ముగ్గురు పిల్ల‌ల్లో మ‌మ‌తే బాగా చ‌దువుతుంద‌ని, ఆమెకు ఇలా కావ‌డం, ప‌రీక్ష‌లు రాయ‌లేక‌పోవ‌డం త‌మ‌ని బాధిస్తున్నాయంటూ ఆమె త‌ల్లి ఊర్మిళ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఊర్మిళ, థానేలో ఇళ్ల‌లో స‌హాయ‌కురాలిగా ప‌నిచేస్తోంది. కాగా మ‌మ‌త తండ్రి నిర్మాణ‌ప‌నుల్లో ప‌నిచేస్తున్నాడు. నిందితుడు షైనీని పోలీసులు అరెస్టు చేశారు. అత‌నిపై హ‌త్యాయ‌త్నం, ఆయుధ చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేశారు.

First Published:  19 March 2016 3:50 AM GMT
Next Story