Telugu Global
Cinema & Entertainment

కాస్త ముందుగానే సిద్ధమౌతున్న త్రివిక్రమ్

నితిన్ తో చేస్తున్న అ..ఆ సినిమాను మే మొదటివారంలో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం అంతకంటే ముందే సినిమాను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు 90శాతం షూటింగ్ పూర్తిచేశాడు. కేవలం మరో 15 రోజులు మాత్రమే షూటింగ్ ఉందని యూనిట్ ప్రకటించింది. అది కూడా చిన్నచిన్న సన్నివేశాలు మాత్రమే మిగిలాయని అంటున్నారు. ఇలా చూసుకుంటే… అ..ఆ సినిమా ఏప్రిల్ మూడో వారానికే సిద్ధమైపోతుందని అంటున్నారు. నిజానికి […]

కాస్త ముందుగానే సిద్ధమౌతున్న త్రివిక్రమ్
X
నితిన్ తో చేస్తున్న అ..ఆ సినిమాను మే మొదటివారంలో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం అంతకంటే ముందే సినిమాను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు 90శాతం షూటింగ్ పూర్తిచేశాడు. కేవలం మరో 15 రోజులు మాత్రమే షూటింగ్ ఉందని యూనిట్ ప్రకటించింది. అది కూడా చిన్నచిన్న సన్నివేశాలు మాత్రమే మిగిలాయని అంటున్నారు. ఇలా చూసుకుంటే… అ..ఆ సినిమా ఏప్రిల్ మూడో వారానికే సిద్ధమైపోతుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా ఆర్థిక కష్టాల కారణంగా ఒక దశలో ఆగిపోతుందని అంతా అనుకున్నారు. బడ్జెట్ ఊహించిన దానికంటే బాగా పెరిగిపోవడంతో…. సినిమాపై అనుమానాలు పెరిగిపోయాయి. అయితే సకాలంలో డబ్బు సర్దుబాటు కావడం….. త్రివిక్రమ్ కూడా స్పీడు పెంచడంతో… ఆ..ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చేసింది. సినిమాలో నితిన్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.
First Published:  19 March 2016 6:27 AM GMT
Next Story