Telugu Global
National

ఆయ‌న ముంబ‌యికి పోలీస్ క‌మిష‌న‌ర్...మెస్‌లో నివాసం!

ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌ర్ ద‌త్తారే పద్‌సాల్‌గిక‌ర్ దాదాపు నెల‌న్న‌ర‌గా ఆఫీస‌ర్స్ మెస్‌లో నివాసం ఉంటున్నారు. ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌రేట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ప‌రిస్థితి ఇంత‌కుముందు ఎప్పుడూ లేదు. మామూలుగా అయితే ఆయ‌న ద‌క్షిణ ముంబ‌యిలో పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌కి చేరువ‌లో ప్ర‌భుత్వం వారిచ్చే నివాస భ‌వనంలో ఉండాలి. కానీ ఆయ‌న వ‌ర్లిలో ఉన్న ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ ఆఫీస‌ర్స్ మెస్‌లో ఒక చిన్న గ‌దిలో ఉంటున్నారు. పద్‌సాల్‌గిక‌ర్ కి ఎకామిడేష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అక్క‌డ ఉంటున్న‌ట్టుగా తెలుస్తోంది.  […]

ఆయ‌న ముంబ‌యికి పోలీస్ క‌మిష‌న‌ర్...మెస్‌లో నివాసం!
X

ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌ర్ ద‌త్తారే పద్‌సాల్‌గిక‌ర్ దాదాపు నెల‌న్న‌ర‌గా ఆఫీస‌ర్స్ మెస్‌లో నివాసం ఉంటున్నారు. ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌రేట్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి ప‌రిస్థితి ఇంత‌కుముందు ఎప్పుడూ లేదు. మామూలుగా అయితే ఆయ‌న ద‌క్షిణ ముంబ‌యిలో పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌కి చేరువ‌లో ప్ర‌భుత్వం వారిచ్చే నివాస భ‌వనంలో ఉండాలి. కానీ ఆయ‌న వ‌ర్లిలో ఉన్న ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ ఆఫీస‌ర్స్ మెస్‌లో ఒక చిన్న గ‌దిలో ఉంటున్నారు. పద్‌సాల్‌గిక‌ర్ కి ఎకామిడేష‌న్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అక్క‌డ ఉంటున్న‌ట్టుగా తెలుస్తోంది. అంత‌కుముందు ప‌దేళ్ల‌కు పైగా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంటులో ప‌నిచేసి ఆనంత‌రం జ‌న‌వ‌రి 31న ఆయ‌న, త‌న సొంత కేడ‌ర్ మ‌హారాష్ట్ర‌కు ముంబ‌యి క‌మిష‌న‌ర్‌గా తిరిగొచ్చారు. అయితే వ‌చ్చిన‌ప్ప‌టినుండి మెస్‌పైన ఉన్న ఒక చిన్న‌గ‌దిలో నివాసం ఉంటున్నారు.

ఈ ప‌రిస్థితిపై వ్యాఖ్యానించిన ఒక ఐపిఎస్ అధికారి, మ‌హారాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముంబ‌యి మేయ‌ర్‌, కేంద్ర, ప‌శ్చిమ రైల్వే మేనేజ‌ర్లు…వీరంద‌రికీ ఉన్న‌ట్టుగా ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌ర్‌కి శాశ్వ‌త‌మైన నివాస‌భ‌వ‌నం లేద‌ని అన్నారు. అడిష‌న‌ల్ జ‌న‌ర‌ల్ ఆప్ పోలీస్ స్థాయి అధికారులు గ‌తంలో ఇలా మెస్‌లో ఉన్న సంద‌ర్భాలు ఉన్నాయ‌ని, కానీ పోలీస్ చీఫే ఇల్లులేక ఇలా ఉండాల్సిరావ‌డం దాదాపు ఇంత‌కుముందు జ‌ర‌గ‌లేద‌నే చెప్పాల‌ని ఆ అధికారి తెలిపారు.

సాధార‌ణంగా ఒక ఐపిఎస్‌ అధికారి ఇత‌ర ప్రాంతాల‌కు బ‌దిలీ అయిన‌పుడు 90రోజుల్లో తాను నివాసం ఉంటున్న ఇల్లుని ఖాళీ చేసి, త‌న త‌రువాత వ‌చ్చే అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఆఫీస‌ర్లు తాము ఆ న‌గ‌రం నుండి లేదా ఆ డిపార్ట్‌మెంట్ నుండి బ‌దిలీ అయినా తమ నివాసాన్ని మాత్రం ఖాళీ చేయ‌డం లేదు. ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌ర్‌కి ఒక శాశ్వ‌త‌మైన నివాసాన్ని ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉందని ఓ మాజీ ఐపిఎస్ అధికారి అన్నారు. ముంబ‌యి పోలీస్ క‌మిష‌న‌ర్ కూడా ఇల్లుకోసం జ‌న‌ర‌ల్ కోటాలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంద‌ని ఆ అధికారి వెల్లడించారు.

First Published:  19 March 2016 1:05 AM GMT
Next Story