Telugu Global
Cinema & Entertainment

సర్దార్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్

తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ను అభిమానులకు అంకితమిచ్చాడు పవన్ కల్యాణ్. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకొచ్చింది. సినిమాలో పవన్ ఓ పాట పాడాడంట. తన సినిమాల్లో చిన్నచిన్న పాటలు పాడ్డం పవన్ కు కొత్తేంకాదు. ఎన్నో ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నాడు. కాకపోతే…. అందరి హీరోల్లో మెయిన్ స్ట్రీమ్ పాటలు కాకుండా…. తన […]

సర్దార్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్
X
తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ను అభిమానులకు అంకితమిచ్చాడు పవన్ కల్యాణ్. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకొచ్చింది. సినిమాలో పవన్ ఓ పాట పాడాడంట. తన సినిమాల్లో చిన్నచిన్న పాటలు పాడ్డం పవన్ కు కొత్తేంకాదు. ఎన్నో ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నాడు. కాకపోతే…. అందరి హీరోల్లో మెయిన్ స్ట్రీమ్ పాటలు కాకుండా…. తన మార్కులో పాటలు పాడ్డం పవన్ స్పెషాలిటీ. అత్తారింటికి దారేదిలో కాటమరాయుడు అనే పాట ఇప్పటికీ అందిరికీ గుర్తే. ఇప్పుడు అదే కోవలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పోతురాజు అనే పాట పాడాడట పవన్ కల్యాణ్. మరికొన్ని గంటల్లో విడుదలకానున్న ఆడియోలో ఈ పాటను కూడా పొందుపరిచారని తెలుస్తోంది. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్-కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించాడు.
First Published:  18 March 2016 8:32 PM GMT
Next Story