Telugu Global
Cinema & Entertainment

సర్దార్ సినిమాకు జానీతో లింకేంటి..?

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు, అప్పుడెప్పుడో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన జానీ సినిమాకు సంబంధం ఉందా… వాస్తవానికి మొన్నటివరకు ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ పవన్ ప్రత్యేకంగా ఈ రెండు సినిమాల మధ్య లింక్ పెట్టాడు. అవును… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ పెట్టిన పవన్…. తన మాటల్లో జానీ ప్రస్తావన తీసుకొచ్చాడు. జానీ సినిమా తర్వాత తను పూర్తిస్థాయిలో […]

సర్దార్ సినిమాకు జానీతో లింకేంటి..?
X
ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు, అప్పుడెప్పుడో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన జానీ సినిమాకు సంబంధం ఉందా… వాస్తవానికి మొన్నటివరకు ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ పవన్ ప్రత్యేకంగా ఈ రెండు సినిమాల మధ్య లింక్ పెట్టాడు. అవును… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్ మీట్ పెట్టిన పవన్…. తన మాటల్లో జానీ ప్రస్తావన తీసుకొచ్చాడు. జానీ సినిమా తర్వాత తను పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రాసిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. అయితే జానీ సినిమాలా సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ తేడా కొట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే… జానీ అనేది ఒక ప్రయోగం… సర్దార్ గబ్బర్ సింగ్ అనేది ఒక ఫార్ములా. కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని, అభిమానులకు అంకితమిస్తూ తీసిన ఈ సినిమాలో పవన్ చెలరేగిపోయాడని టాక్. ఫన్నీ స్టెప్పులు, కామెడీ డైలాగులు, తన మార్క్ పంచ్ లతో పవన్ రెచ్చిపోయాడట. కాబట్టి… జానీతో ఫ్లాప్ అందుకున్న పవన్… ఈసారి తన మార్క్ స్క్రీన్ ప్లేతో సర్దార్ తో సూపర్ హిట్ అందుకుంటాడని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
First Published:  19 March 2016 9:00 PM GMT
Next Story