Telugu Global
NEWS

తండ్రి మ‌ర‌ణ‌వార్త‌ని దాచి...ప‌రీక్ష రాయించారు!

పిల్ల‌లు రాసే ప‌రీక్ష‌ల‌కంటే జీవితం పెట్టే ప‌రీక్ష‌లు చాలా పెద్ద‌వి. తెల్ల‌వారితే ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు  హాజ‌రు కావాల్సిన ఒక విద్యార్థిని తండ్రి ఆ రాత్రే  హ‌ఠాత్తుగా మ‌ర‌ణించాడు. కానీ కుటుంబ స‌భ్యులు ఆమెకు ఆ విష‌యం తెలియ‌నీయ‌కుండా ఆ అమ్మాయి ప‌రీక్ష‌కు వెళ్లేలా చేయ‌గ‌లిగారు. వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. గుడికందుల దేవేంద‌ర్ (41) క‌ట్రియాల పెట్రోల్ పంపులో ప‌నిచేస్తున్నాడు. ఆదివారం య‌ధా ప్ర‌కారం విధుల‌కు వెళ్లిన దేవేంద‌ర్ ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డ్డాడు. అత‌ని త‌ల‌కు […]

తండ్రి మ‌ర‌ణ‌వార్త‌ని దాచి...ప‌రీక్ష రాయించారు!
X

పిల్ల‌లు రాసే ప‌రీక్ష‌ల‌కంటే జీవితం పెట్టే ప‌రీక్ష‌లు చాలా పెద్ద‌వి. తెల్ల‌వారితే ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల్సిన ఒక విద్యార్థిని తండ్రి ఆ రాత్రే హ‌ఠాత్తుగా మ‌ర‌ణించాడు. కానీ కుటుంబ స‌భ్యులు ఆమెకు ఆ విష‌యం తెలియ‌నీయ‌కుండా ఆ అమ్మాయి ప‌రీక్ష‌కు వెళ్లేలా చేయ‌గ‌లిగారు. వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. గుడికందుల దేవేంద‌ర్ (41) క‌ట్రియాల పెట్రోల్ పంపులో ప‌నిచేస్తున్నాడు. ఆదివారం య‌ధా ప్ర‌కారం విధుల‌కు వెళ్లిన దేవేంద‌ర్ ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద‌ప‌డ్డాడు. అత‌ని త‌ల‌కు తీవ్ర‌మైన గాయం కావ‌డంతో మృతి చెందాడు. దేవేంద‌ర్ కుమార్తె కావ్య శివాని ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతోంది. ఈ విష‌యం తెలిస్తే పరీక్ష రాయ‌లేద‌నే ఉద్దేశంతో కుటుంబ స‌భ్యులు తండ్రి మ‌ర‌ణాన్నిఆమెకు తెలియ‌కుండా దాచారు. కావ్య‌శివానీ సోమ‌వారం ప‌రీక్ష రాసింది. ఆమె తిరిగి వ‌చ్చాక అంత్య‌క్రియ‌లు జ‌రిపేందుకు కుటుంబ స‌భ్యులు సిద్ధ‌మ‌వుతున్నారు. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో తండ్రి మ‌ర‌ణించ‌డం ఆ బాలిక‌కు తీర‌ని దుఃఖ‌మే. శివానీ మ‌నో నిబ్బ‌రంతో మిగిలిన ప‌రీక్ష‌లు రాస్తుంద‌ని ఆశిద్దాం.

First Published:  21 March 2016 1:05 AM GMT
Next Story