ఈసారి రాజకీయాలకు పూర్తిగా దూరం

తమిళనాట ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమిళ జనం రజనీకాంత్ వైపు చూస్తారు. సూపర్ స్టార్ ఏమైనా పార్టీ పెడతాడేమోనని ఆశగా ఎదురుచూస్తారు. కనీసం ఏ నేతకైనా మద్దతైనా ఇస్తారేమోనని వెయిట్ చేస్తారు. దీనికి తోడు ఆమధ్య నరేంద్ర మోదీ-రజనీకాంత్ మధ్య జరిగిన భేటీ కూడా రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి సంకేతంగా అందరూ భావించారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ… రజనీకాంత్ మరోసారి తెరవెనక వ్యక్తిగా మారిపోయారు. ఈసారి ఎన్నికలకు సంబందించి రజనీకాంత్ అస్సలు పెదవి విప్పడం లేదు. కనీసం ఎవరికీ మద్దతు తెలుపుతూ ప్రకటన చేయలేదు. అంతెందుకు… రాజకీయాలపై స్పందించేందుకు మీడియాకు కూడా అందుబాటులోకి రాలేదు. ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కు చేరుకున్న వేళ… రజనీ మాత్రం తన సినిమాలతో బిజీ అయిపోయారు. రాజకీయాలకు పూర్తిగా దూరమనే సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఇచ్చారు. తను కేవలం ఓ సూపర్ స్టార్ గా, వివాద రహితుడిగా, రాజకీయాలకూ దూరంగా మిగిలిపోవాలనుకుంటున్నాడు రజనీకాంత్.