Telugu Global
Cinema & Entertainment

సర్దార్ ట్రయిలర్ హిట్.... పాటలు ఫట్....

సింపుల్ గా చెప్పాలంటే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో ఒక ప్లస్, ఒక మైనస్ ఇది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి విడుదలైన మొట్టమొదటి ట్రయిలర్…. అందరి అంచనాల్ని అందుకుంది. ట్రయిలర్ కట్ చేసిన విధానం… అందులో పవన్ ఎంట్రీ అదిరిపోయాయి. టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో… ట్రయిలర్ కు అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనడంలో ఆశ్చర్య లేదు. మరీ ముఖ్యంగా సినిమాకు హైప్ తీసుకొచ్చే […]

సర్దార్ ట్రయిలర్ హిట్.... పాటలు ఫట్....
X
సింపుల్ గా చెప్పాలంటే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో ఒక ప్లస్, ఒక మైనస్ ఇది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి విడుదలైన మొట్టమొదటి ట్రయిలర్…. అందరి అంచనాల్ని అందుకుంది. ట్రయిలర్ కట్ చేసిన విధానం… అందులో పవన్ ఎంట్రీ అదిరిపోయాయి. టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో… ట్రయిలర్ కు అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనడంలో ఆశ్చర్య లేదు. మరీ ముఖ్యంగా సినిమాకు హైప్ తీసుకొచ్చే విధంగా పవన్ చెప్పిన డైలాగ్ సూపర్బ్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ కు సిసలైన కేరాఫ్ అడ్రస్ గా థియేట్రికల్ ట్రయిలర్ ను చెప్పుకోవచ్చు.
సేమ్ టైం…. పాటలు మాత్రం అలనాటి గబ్బర్ సింగ్ తో పోలిస్తే కాస్త లో-లెవెల్ లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. అప్పటి గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటే.. పాటలు ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫంక్షన్ లో ఒక్కో పాట ప్లే అవుతుంటే… ఇనిస్టెంట్ గా హిట్టయింది. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ నుంచి ఆకాశం అమ్మాయైతే…. కెవ్వు-కేక…. దిల్ సే… లాంటి పాటలన్నీ ఆ క్షణమే హిట్టయ్యాయి. సర్దార్ గబ్బర్ సింగ్ లో మాత్రం ఆ మేజిక్ మిస్సయింది. మరీ ముఖ్యంగా అప్పటి ఐటెంసాంగ్ తో పోల్చిచూస్తే…. తాజా ఐటెంసాంగ్ తేలిపోయింది. ఎక్కడో విన్నట్టు కొడుతోంది. మిగతా పాటలు కూడా సోసోగానే ముగిసిపోయాయి. ఓవరాల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ భవితవ్యం ఇప్పుడు సాంగ్స్ పై కాకుండా పవన్ స్టామినాపై ఆధారపడి ఉందనే విషయం క్రిస్టల్ క్లియర్.
First Published:  21 March 2016 1:06 AM GMT
Next Story