Telugu Global
National

విరాట్ బ్యాట్‌...ప్ర‌చారంలోనూ ఫ‌స్టే!

త‌న బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న విరాట్ కోహ్లీ క్రికెట‌రుగా త‌న విశ్వ‌రూపం చూపించేస్తున్నాడు. స‌చిన్ త‌రువాత అత‌ని స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు అనుకున్న వారిని కూడా త‌న ఆట‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్ప‌టికే విరాట్, సచిన్ నెల‌కొల్పిన కొన్ని రికార్డుల‌ను త‌న సొంతం చేసుకున్నాడు. శ‌నివారం పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ జ‌ట్టు విజ‌యంలో తీసుకున్న భాగ‌స్వామ్యం అత‌డిని మ‌రొక‌మెట్టు ఎక్కించింది.  విరాట్ అభిమానుల గుండెల్లో  క్రికెట్ దేవుడిగా అవ‌త‌రించాడు అన‌డంలో ఏమాత్రం […]

విరాట్ బ్యాట్‌...ప్ర‌చారంలోనూ ఫ‌స్టే!
X

త‌న బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న విరాట్ కోహ్లీ క్రికెట‌రుగా త‌న విశ్వ‌రూపం చూపించేస్తున్నాడు. స‌చిన్ త‌రువాత అత‌ని స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు అనుకున్న వారిని కూడా త‌న ఆట‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇప్ప‌టికే విరాట్, సచిన్ నెల‌కొల్పిన కొన్ని రికార్డుల‌ను త‌న సొంతం చేసుకున్నాడు. శ‌నివారం పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ జ‌ట్టు విజ‌యంలో తీసుకున్న భాగ‌స్వామ్యం అత‌డిని మ‌రొక‌మెట్టు ఎక్కించింది. విరాట్ అభిమానుల గుండెల్లో క్రికెట్ దేవుడిగా అవ‌త‌రించాడు అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. అత‌ను సంపాదించుకున్న అభిమానం, బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా విరాట్ సంపాద‌న‌ను మ‌రింత పెంచుతోంది. విరాట్ కోహ్లీ ప్రచార‌ రాయ‌బారిగా ధోనీతో పోటీప‌డుతున్నాడు. త‌న‌బ్యాట్‌పై స్పార్ట‌న్ స్టిక్క‌ర్ ధ‌రించినందుకు ధోనీ ఆరు కోట్లు తీసుకుంటుంటే, టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్‌ని వాడుతున్నందుకు ఎనిమిది కోట్లు పుచ్చుకుంటున్నాడు. అలాగే పిచ్‌మీద ధ‌రించిన దుస్తులు, వేసుకున్న షూస్ తాలూకూ కంపెనీల నుండి మ‌రో రెండు కోట్లు తీసుకుంటున్నాడు. టివిలో ప్ర‌చారచిత్రాల్లో క‌నిపించినందుకు ఆయా సంస్థ‌ల నుండి ధోనీ ఎనిమిది కోట్లు తీసుకుంటే విరాట్ ఐదుకోట్ల పారితోష‌కం అందుకుంటున్నాడు.

First Published:  20 March 2016 9:00 PM GMT
Next Story