Telugu Global
Health & Life Style

గుండె బాగుంటే..మెదడూ బాగుంటుంది!

గుండెని భ‌ద్రంగా ఉంచుకుంటే మ‌న మెద‌డు కూడా ఆరోగ్యంగా ఉంటుంద‌ని అమెరికాలోని మైమీ మిల్ల‌ర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు అంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్న పెద్ద‌వారిలో ఆలోచ‌నలు ప‌దును త‌గ్గ‌క‌పోవ‌డం, జ్ఞాప‌క‌శ‌క్తి చురుగ్గా ఉండ‌టం వీరు గ‌మ‌నించారు. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వారి జ‌ర్న‌ల్‌లో ఈ వివ‌రాల‌ను ప్ర‌చురించారు. ఈ అధ్య‌య‌నం కోసం శాస్త్ర‌వేత్త‌లు 72ఏళ్ల స‌గ‌టు వ‌య‌సులో ఉన్న వెయ్యిమందిని ఎంపిక చేసుకున్నారు.  అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ గుండె ఆరోగ్యం కోసం చెప్పిన […]

గుండె బాగుంటే..మెదడూ బాగుంటుంది!
X

గుండెని భ‌ద్రంగా ఉంచుకుంటే మ‌న మెద‌డు కూడా ఆరోగ్యంగా ఉంటుంద‌ని అమెరికాలోని మైమీ మిల్ల‌ర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు అంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్న పెద్ద‌వారిలో ఆలోచ‌నలు ప‌దును త‌గ్గ‌క‌పోవ‌డం, జ్ఞాప‌క‌శ‌క్తి చురుగ్గా ఉండ‌టం వీరు గ‌మ‌నించారు.

అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ వారి జ‌ర్న‌ల్‌లో ఈ వివ‌రాల‌ను ప్ర‌చురించారు. ఈ అధ్య‌య‌నం కోసం శాస్త్ర‌వేత్త‌లు 72ఏళ్ల స‌గ‌టు వ‌య‌సులో ఉన్న వెయ్యిమందిని ఎంపిక చేసుకున్నారు. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ గుండె ఆరోగ్యం కోసం చెప్పిన సూచ‌న‌ల‌ను పాటించాల్సిందిగా వీరిని కోరారు.

ఆ సూచ‌న‌లు… ర‌క్త‌పోటు స‌క్ర‌మంగా ఉండేలా చూసుకోవ‌డం, కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను నియంత్రించ‌డం, ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా చూసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం, ఆరోగ్య‌వంత‌మైన ఆహారం తీసుకోవ‌డం, బ‌రువుని త‌గ్గించుకోవ‌డం, సిగ‌రెట్లు తాగ‌కుండా ఉండ‌టం.

అయితే అధ్య‌య‌నం కోసం ఎంపిక చేసిన‌వారిలో ఈ ఏడు సూచ‌న‌ల‌ను ఎవ‌రూ పాటించ‌లేక‌పోయారు. ఒక్క‌శాతం మంది మాత్ర‌మే ఆరింటిని పాటించ‌గ‌లిగారు.

అధ్య‌య‌నానికి ముందు వెయ్యిమందికి వారి వారి మెద‌డు శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను నిర్ణ‌యించే ప‌రీక్ష‌లు పెట్టారు. ఎంత చురుగ్గా ఆలోచించ‌గ‌లుగుతున్నారు, ఎంత‌గా ఏకాగ్ర‌త నిలుపుతున్నారు, జ్ఞాప‌క‌శ‌క్తి ఎలా ఉంది… త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. ఆరేళ్ల త‌రువాత వెయ్యిమందిలో అందుబాటులో ఉన్న 722మందికి అవే ప‌రీక్ష‌ల‌ను తిరిగి చేశారు. ఎవ‌రైతే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ‌స్తున్నారో, వారిలో మెద‌డు చురుగ్గా, స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్టుగా గ‌మ‌నించారు. ముఖ్యంగా పొగ‌తాగ‌కుండా ఉండ‌టం, స‌రైన బ‌రువు ఉండ‌టం, ర‌క్తంలోషుగ‌ర్ స్థాయిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం ఈ మూడు అంశాలు గుండె ఆరోగ్యాన్ని, త‌ద్వారా మెద‌డు ఆరోగ్యాన్ని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయ‌ని ఈ ప‌రిశోధ‌కులు గుర్తించారు.

First Published:  22 March 2016 7:16 AM GMT
Next Story