Telugu Global
NEWS

మొగుడు పాయే! ఏసీపీ వాడి వదిలేసే! మోసపోయిన టీడీపీ మహిళా నేత

విశాఖ జిల్లా మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు, ఎస్ రాయవరం మాజీ ఎంపీపీ పద్మలత  పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశాడంటూ ఫిర్యాదులో పలు విషయాలు వెల్లడించారామె. పద్మలత తండ్రి మూడుసార్లు పాయకరావుపేట ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గతంలో ఈమె కూడా ఎంపీపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో దాసరి రవిబాబు ఎలమంచిలి సీఐగా ఉండగా ఒక కేసు విషయంలో అతడి దగ్గరకు పద్మలత వెళ్లారు. కేసును ఆసరాగా చేసుకుని పద్మలతను రవిబాబు బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపణ. […]

మొగుడు పాయే! ఏసీపీ వాడి వదిలేసే! మోసపోయిన టీడీపీ మహిళా నేత
X

విశాఖ జిల్లా మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు, ఎస్ రాయవరం మాజీ ఎంపీపీ పద్మలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశాడంటూ ఫిర్యాదులో పలు విషయాలు వెల్లడించారామె. పద్మలత తండ్రి మూడుసార్లు పాయకరావుపేట ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. గతంలో ఈమె కూడా ఎంపీపీగా పనిచేశారు. 2000 సంవత్సరంలో దాసరి రవిబాబు ఎలమంచిలి సీఐగా ఉండగా ఒక కేసు విషయంలో అతడి దగ్గరకు పద్మలత వెళ్లారు.

కేసును ఆసరాగా చేసుకుని పద్మలతను రవిబాబు బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపణ. తన కోరిక తీరిస్తే కేసు లేకుండా చేస్తానని కాదంటే ప్రధాన నిందితురాలిగా చేరుస్తానని బెదిరించారు. దీంతో రవిబాబుకు పద్మలత లొంగిపోయింది. ఆయన చెప్పినట్టు చేసింది. ఆ సమయంలో పద్మలతకు రవిబాబు పెళ్లి చేసుకుంటానని భరోసా కూడా ఇచ్చారు. రవిబాబు మాటల మాయలోపడి ఆయన సలహామేరకు ఉన్న భర్తకు విడాకుల నోటీసు పంపింది.. అప్పటికే ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పోలీస్ అధికారి మాయలో పడి భర్తను దూరం చేసుకుంది. కొద్దికాలం పాటు రవిబాబు, పద్మలత సంబంధం సాఫీగానే సాగింది. అనంతరం రవిబాబు చోడవరం బదిలీ అయ్యారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు పద్మలత సిద్ధపడగా రాజకీయాలు వద్దు మనం ఇద్దరం కలిసి సుఖంగా ఉందామంటూ రవిబాబు ఆమెను వెనక్కులాగాడు.

తాను ఇతరప్రాంతాలకు బదిలీ అయినా రవిబాబు మాత్రం పద్మలతను కలుస్తూనే ఉండేవాడు. అనంతరం ఆయనకు మధురవాడ ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుంచి రవిబాబు ప్లేట్ ఫిరాయించాడని పద్మలత చెబుతోంది. ” పెళ్లిలేదు ఏమీ లేదు నీకు దిక్కున్న చోట చెప్పుకో” అని బెదిరించాడని ఫిర్యాదులో పద్మలత వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య గొడవపై గతంలోఅప్పటి అనకాపల్లి ఎంపీ చలపతిరావు సమక్షంలో సెటిల్ మెంట్ కూడా జరిగిందని ఆమె చెబుతున్నారు. ఈవిషయం దాడి వీరభద్రరావు, అయ్యన్న పాత్రుడులకు తెలుసని పద్మలత చెబుతున్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని విశాఖ కమిషనర్ అమిత్ గార్గ్‌ను ఆమె కోరారు. ఇప్పుడు భర్తను దూరం చేసుకుని, ఇటు ఏసీపీ కూడా హ్యాండ్ ఇవ్వడంతో పద్మలత దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మోసపోయిన పద్మలతకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఖాకీ చొక్కాను అడ్డుపెట్టుకుని మహిళ జీవితంతో ఆడుకున్న పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Click on Image to Read:

jagan

jagan-nellore

jagan1

cbn

roja-padma

jagan anitha

ysrcp-mlas

jyothula-nehru

buggana

anitha

First Published:  23 March 2016 1:35 AM GMT
Next Story