మ‌ళ్లీ విరాట్ మొద‌లెట్టాడా..?

ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ అభిమానులు జ‌పిస్తున్న మంత్రం కోహ్లీ అనే చెప్పాలి. అయితే త‌న ప్రేమ‌యాణం బ్రేక‌ప్ విష‌యంలో అభిమానులు కొంద‌రు అనుష్క ను వ‌దిలేశాక .. కోహ్లీ బాగు ప‌డ్డాడు… బాగా ఆడుతున్నాడు… ఏవిధ‌మైన త‌ల‌నొప్పులు లేవ‌నే కామెంట్స్ చేస్తున్నారు.. వీటికి విరాట్ కోహ్లీ త‌న మాజీ ప్రియురాలికి మ‌ద్దతుగా తిరిగి త‌న ట్విట‌ర్ ఖాతాలో కామెంట్స్ పెట్టాడు.

తనకు ఎంతో పాజిటివ్ థింకింగ్ ను అనుష్క‌ అల‌వాటు చేసింద‌ని.. త‌న గురించి కామెంట్ చేసేముందు .. ఆలోచించుకోవాల‌ని ట్విట్ చేశారు. మొన్న పాకిస్థాన్ పై ఇండియా ను గెలిపించిన రోజు అనుష్క శ‌ర్మ .. త‌న మాజీ ల‌వ‌ర్ ను ఉద్దేశించి బాగ ఆడావు కోహ్లీ అని కామెంట్స్ పెట్టిన విషయం తెలిసిందే. నిన్న విరాట్ విశ్వ రూపం చూపించి ఇండియాను సేమిస్ కు చేర్చ‌డంతో భారతీయ క్రికెట్ లోకం అంతా కోహ్లీ నామ జ‌పం చేస్తున్నారు. అయితే విరాట్ మాత్రం త‌న మాజి ప్రేయ‌సి పై ఈగ వాల‌కుండ స్పందిస్తుండ‌టం చూస్తుంటే.. ఇద్దరి మ‌ధ్య ఏవో పాజిటివ్ సిగ్నిల్స్ ట్రాన్స‌ఫర్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఏమో ప్రేమ క‌థ‌లు.. విర‌హ వ్య‌థ‌లు మ‌ర‌పురాని సుధ‌ల‌ని పెద్ద‌లు ఊర్కినే అన‌లేదు క‌దా.!