Telugu Global
Health & Life Style

నాన్నా... నువ్వూ సరిగ్గా తినాలి!

పుట్టబోయే బిడ్డమీద తల్లి తినే ఆహారం, ఆమె మాన‌సిక శారీర‌క ఆరోగ్య పరిస్థితులు ఎక్కువ ప్రబావాన్ని చూపుతాయన్న సంగ‌తి తెలిసిందే.  అయితే తల్లివే కాదు, బిడ్డపై తండ్రి ఆహారపు అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయట. పురుషుడి స్పెర్మ్ (వీర్యకణాలు) లో అతని డిఎన్ఎ అంటే జన్యువుల కలెక్షన్ (జీనోమ్) లక్షణాలు మొత్తం కలిసి ఉంటాయి. బిడ్డకు ఈ జీనోమ్‌ని స్పెర్మ్ ద్వారా అందించడంతో ఇక తండ్రి పని పూర్తయి పోయిన‌ట్టే అని భావిస్తాము.  ఆ తరువాత బిడ్డ […]

నాన్నా... నువ్వూ సరిగ్గా తినాలి!
X

పుట్టబోయే బిడ్డమీద తల్లి తినే ఆహారం, ఆమె మాన‌సిక శారీర‌క ఆరోగ్య పరిస్థితులు ఎక్కువ ప్రబావాన్ని చూపుతాయన్న సంగ‌తి తెలిసిందే. అయితే తల్లివే కాదు, బిడ్డపై తండ్రి ఆహారపు అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయట. పురుషుడి స్పెర్మ్ (వీర్యకణాలు) లో అతని డిఎన్ఎ అంటే జన్యువుల కలెక్షన్ (జీనోమ్) లక్షణాలు మొత్తం కలిసి ఉంటాయి. బిడ్డకు ఈ జీనోమ్‌ని స్పెర్మ్ ద్వారా అందించడంతో ఇక తండ్రి పని పూర్తయి పోయిన‌ట్టే అని భావిస్తాము. ఆ తరువాత బిడ్డ ఎదుగుదల అంతా తల్లి తీసుకునే ఆహారం, ఆమె మానసిక స్థితి తదితర అంశాలమీదే ఆధారపడి ఉంటుంది. త‌ల్లి బిడ్డ‌కు డిఎన్ఎ కంటే ఎక్కువ‌గా మ‌రెంతో స‌మ‌కూరుస్తుంది. తండ్రి డిఎన్ఎలో క‌ణాల‌కు శ‌క్తినిచ్చే మైటోకాండ్రియా ఉండ‌దు. త‌ల్లిలోని అండ‌క‌ణాల్లోనే ఇది ఉంటుంది. దీన్ని బ‌ట్టి త‌ల్లిపాత్ర బిడ్డ తయార‌వ‌డంలో ఎంత ముఖ్య‌మో మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. వైద్యులు కూడా అన్ని స‌ల‌హాలు, ఆరోగ్య జాగ్ర‌త్త‌లు త‌ల్లికే చెబుతుంటారు.

ఇదంతా ప‌క్క‌నుంచితే గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన అనేక ప‌రిశోధ‌న‌ల్లో బిడ్డ ఆరోగ్యంపై తండ్రి పాత్ర కూడా మ‌నం అనుకుంటున్న‌దానికంటే చాలా ఎక్కువ‌గా ఉంద‌ని తేలింది. న్యూజిల్యాండ్‌లో 2000 జంట‌ల మీద తండ్రి ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై అధ్య‌య‌నాలు నిర్వ‌హించారు. తండ్రి అధిక‌బ‌రువుతో ఉన్న‌పుడు ముఖ్యంగా తండ్రిలో పొట్ట అధికంగా ఉన్న‌పుడు బిడ్డ త‌క్కువ బ‌రువుతో పుట్టే అవ‌కాశాలు 60శాతం పెరుగుతాయ‌ని ఈ అధ్య‌య‌నాల్లో గ‌మ‌నించారు. అయితే త‌ల్లి బ‌రువుకి బిడ్డ బ‌రువుకి మాత్రం సంబంధం లేక‌పోవ‌డం చూశారు.

తండ్రి ఆహారపు అల‌వాట్లు పిల్ల‌ల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయనే అంశాన్ని నిర్దారించ‌డానికి కెన‌డాలోని మెక్‌గిల్ యూనివ‌ర్శిటీలో ఎలుక‌ల మీద ప‌రిశోధ‌న నిర్వ‌హించారు.

ఇందులో మ‌గ ఎలుక‌ల‌కు ఫోలిక్ యాసిడ్ (బి9) ఇవ్వ‌కుండా, ఆ లోపం ఉండేలా ఆహారాన్ని ఇచ్చారు. త‌రువాత ఈ ఎలుక‌లు ఆరోగ్య‌వంత‌మైన ఆడ ఎలుక‌ల‌తో క‌లిసిన‌పుడు వీటికి పుట్టిన పిల్ల‌ల్లో కొన్నింటికి అద‌న‌పు వేళ్లు ఉండ‌టం, కొన్నింటిలో బ‌ల‌హీన‌మైన ఎముక‌లు ఉండ‌టం గుర్తించారు. దీన్ని బ‌ట్టి మ‌గ ఎలుక‌ల్లోని డిఎన్ఎ లోపాలు వాటి పిల్ల‌ల‌కు సంక్ర‌మించిన‌ట్టుగా గుర్తించారు.

అలాగే కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ఆహారాన్ని తీసుకున్న మ‌గ ఎలుక‌ల వ‌ల‌న జ‌న్మించిన ఎలుక‌ల్లో మ‌ధుమేహం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌టం గుర్తించారు. కొవ్వు ఆహారం తీసుకోని మ‌గ ఎలుక‌ల వ‌ల‌న జ‌న్మించిన ఎలుక‌ల్లో ఎలాంటి అనారోగ్యాలు లేవు. దీన్ని బ‌ట్టి భార్య గ‌ర్భందాల్చడానికి ముందురోజుల్లో భ‌ర్త‌లు తీసుకునే ఆహారం త‌ప్ప‌కుండా పిల్ల‌ల శ‌రీర తీరు, నిర్మాణం, ల‌క్ష‌ణాలు, ఆరోగ్యం త‌దిత‌ర అంశాల‌మీద‌ ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని తెలుస్తోంది.

First Published:  27 March 2016 5:17 AM GMT
Next Story