Telugu Global
NEWS

రాజప్పకు జ్యోతుల భయం " ‘’అబ్బే ఆయనకు నీటిపారుదల అంటే ఇష్టం’’!

వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంతో టీడీపీలోని కాపు నేతల్లో అలజడి రేగుతోంది. తమ అవకాశాలకు జ్యోతుల  ఎక్కడ గండి కొడుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రి పదవులు ఆశించి అసెంబ్లీలో, బయట ఇంతకాలం దూకుడుగా వైసీపీ మీద విరుచుకుపడ్డ కాపు ఎమ్మెల్యేలు సైతం ఆందోళన చెందుతున్నారు. వైసీపీని బలహీనపరిచే ఉద్దేశంతో జ్యోతులను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆయనకు భారీ ఆఫరే ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అందులో మంత్రి పదవి కూడా […]

రాజప్పకు జ్యోతుల భయం  ‘’అబ్బే ఆయనకు నీటిపారుదల అంటే ఇష్టం’’!
X

వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంతో టీడీపీలోని కాపు నేతల్లో అలజడి రేగుతోంది. తమ అవకాశాలకు జ్యోతుల ఎక్కడ గండి కొడుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రి పదవులు ఆశించి అసెంబ్లీలో, బయట ఇంతకాలం దూకుడుగా వైసీపీ మీద విరుచుకుపడ్డ కాపు ఎమ్మెల్యేలు సైతం ఆందోళన చెందుతున్నారు. వైసీపీని బలహీనపరిచే ఉద్దేశంతో జ్యోతులను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఆయనకు భారీ ఆఫరే ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అందులో మంత్రి పదవి కూడా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లో హోంమంత్రి చినరాజప్ప ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

జ్యోతుల పార్టీలోకి వస్తున్నారట కదా… కేబినెట్ విస్తరణ ఉంటుందా అని ప్రశ్నించగా రాజప్ప తెలివిగా సమాధానం చెప్పారు. కేబినెట్ విస్తరణపై తనకు సమాచారం లేదంటూనే… జ్యోతుల నెహ్రుకు నీటీపారుదల శాఖ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అంటే పరోక్షంగా తన పదవికి జ్యోతుల నెహ్రు పోటీ రాకుండా ముందే డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సాగునీటిపారుదల శాఖను దేవినేని ఉమ నిర్వహిస్తున్నారు. కాబట్టి జ్యోతులకు ఆ శాఖ ఇస్తేనే బాగుంటుందని చినరాజప్ప సూచించారు. అయినా చంద్రబాబు అంత అమాయకుడా?. తనకు ఇష్టమైన దేవినేని శాఖను తీసి జ్యోతులకు ఇవ్వడానికి!. రాజప్ప పదవికి వచ్చిన ముప్పు కూడా ఏమీ లేదు. ఎందుకంటే జ్యోతుల లాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవిని చంద్రబాబు కట్టబెట్టే చాన్సే లేదు. ఆ కోణంలోనే ఫస్ట్ టైమ్ ఎన్నికైన చినరాజప్పను డిప్యూటీ, హోంమంత్రిని చేశారు చంద్రబాబు.

Click on Image to Read:

ktr-revanth

bhuma

jyotula-nehru

jd-laxminarayna

Aparna-Rao

bonda-roja

ysr-sai-pratap

jagan sai pratap

women

jc-raghuveera

jagapathi

jaleel-khan

ts-assembly

ysrcp MLA Subba rao

yanamala

yuvaraj dhoni

balakrishna

jc-diwakar-jagan-chandrababu

First Published:  28 March 2016 2:20 AM GMT
Next Story