Telugu Global
CRIME

కుక్క‌పై అత్యాచారం...ఆపై హ‌త్య‌!!!

దేవుడా…చివ‌రికి కుక్క‌ల‌ను కూడా వ‌ద‌ల‌ని స్థితికి మ‌నిషి దిగ‌జారాడు. అమెరికాలో జ‌రిగిన ఈ ఘోరం ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. దుండ‌గులు ఓ ఆడ‌కుక్క‌పై పాశ‌వికంగా అత్యాచారం చేసి హ‌త్య‌చేశారు. పైగా దాని శ‌రీరాన్ని చెట్టుకు వెళ్లాడ‌దీశారు. ఇది కుక్క‌పై క‌క్ష అనుకోవాలో, మ‌నిషిలోని ప‌ర్వ‌ర్ష‌న్‌కి ప‌రాకాష్ట అనుకోవాలో తెలియ‌ని స్థితి. అమెరికా, వాషింగ్ట‌న్ థ‌ర్స‌న్ కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. అమెరికా నిఘా భ‌ద్ర‌తా ద‌ళం, ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ సైతం ఈ కేసు విచార‌ణ‌లో […]

కుక్క‌పై అత్యాచారం...ఆపై హ‌త్య‌!!!
X

దేవుడా…చివ‌రికి కుక్క‌ల‌ను కూడా వ‌ద‌ల‌ని స్థితికి మ‌నిషి దిగ‌జారాడు. అమెరికాలో జ‌రిగిన ఈ ఘోరం ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంది. దుండ‌గులు ఓ ఆడ‌కుక్క‌పై పాశ‌వికంగా అత్యాచారం చేసి హ‌త్య‌చేశారు. పైగా దాని శ‌రీరాన్ని చెట్టుకు వెళ్లాడ‌దీశారు. ఇది కుక్క‌పై క‌క్ష అనుకోవాలో, మ‌నిషిలోని ప‌ర్వ‌ర్ష‌న్‌కి ప‌రాకాష్ట అనుకోవాలో తెలియ‌ని స్థితి. అమెరికా, వాషింగ్ట‌న్ థ‌ర్స‌న్ కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. అమెరికా నిఘా భ‌ద్ర‌తా ద‌ళం, ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ సైతం ఈ కేసు విచార‌ణ‌లో పాలుపంచుకుంటోంది. అమెరికాకు చెందిన అతిపెద్ద జంతుహ‌క్కుల సంర‌క్ష‌ణ సంస్థ ది హ్యుమ‌న్ సొసైటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ దుండ‌గుల‌ను ప‌ట్టించిన‌వారికి 5వేల డాల‌ర్ల బ‌హుమ‌తి కూడా ప్ర‌క‌టించింది. సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో ప్ర‌క‌టించే మొత్తానికి ఇది రెట్టింపు. ఆ సంస్థ‌లోని ఒక బోర్డు స‌భ్యుడు ఆ అద‌న‌పు మొత్తాన్ని తాను సొంతంగా ప్ర‌క‌టించాడు.

ఆ కుక్క అనుభ‌వించిన ఆఖ‌రిక్ష‌ణాలు అత్యంత భ‌యంక‌ర‌మైన‌వ‌ని, ఈ కేసులో ప్ర‌క‌టించిన న‌గ‌దు బ‌హుమ‌తి వ‌ల‌న నేర‌స్తులు దొరుకుతార‌నే న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని ది హ్యుమ‌న్ సొసైటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కి వాషింగ్ట‌న్ స్టేట్ డైర‌క్ట‌ర్ దాన్‌పాల్ అన్నారు.

First Published:  27 March 2016 9:00 PM GMT
Next Story