Telugu Global
Cinema & Entertainment

 విడుదలకు ముందే సరైనోడు బ్లాక్ బస్టర్

సరైనోడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ కూడా విడుదల చేయట్లేదు. ఏప్రిల్ 1 నుంచి పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈలోగా పాటలకు, సినిమాకు ప్రచారం కల్పించే పని షురూ చేశారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్ ను ఐటెంసాంగ్ తో స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన యూనిట్… తాజాగా బ్లాక్ బస్టర్ అనే ఐటెంసాంగ్ ను విడుదల చేశారు. […]

 విడుదలకు ముందే సరైనోడు బ్లాక్ బస్టర్
X
సరైనోడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ కూడా విడుదల చేయట్లేదు. ఏప్రిల్ 1 నుంచి పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఈలోగా పాటలకు, సినిమాకు ప్రచారం కల్పించే పని షురూ చేశారు. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్ ను ఐటెంసాంగ్ తో స్టార్ట్ చేశారు. ఇప్పటికే టీజర్ ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన యూనిట్… తాజాగా బ్లాక్ బస్టర్ అనే ఐటెంసాంగ్ ను విడుదల చేశారు. అంజలి ఐటెంభామగా నటించిన ఈ ఐటెంసాంగ్ లో బన్నీ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మరోవైపు తమన్ సంగీతం ఎప్పట్లానే అనిపిస్తున్నప్పటికీ… ఐటెంభామగా అంజలి మాత్రం బాగానే కవ్విస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సరైనోడు సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ తండ్రి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
First Published:  28 March 2016 12:41 AM GMT
Next Story