Telugu Global
Cinema & Entertainment

పవన్ పారితోషికం ఎంతో తెలుసా....?

మన హీరోలంతా 12 కోట్లు… 15 కోట్లు మధ్యే నలుగుతున్నారు. మహేష్ లాంటి స్టార్లు అప్పుడప్పుడు 20 దాకా వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లెక్కలన్నీ సర్దార్ గబ్బర్ సింగ్ తో దాటేశాడట పవన్ కల్యాణ్.  సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్… మొత్తంగా చూసుకుంటే… సర్దార్ సినిమాతో దాదాపు 33కోట్ల రూపాయలు వెనకేశాడని చెబుతున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు పవన్. చివరికి ప్రీ-రిలీజ్ […]

పవన్ పారితోషికం ఎంతో తెలుసా....?
X
మన హీరోలంతా 12 కోట్లు… 15 కోట్లు మధ్యే నలుగుతున్నారు. మహేష్ లాంటి స్టార్లు అప్పుడప్పుడు 20 దాకా వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ లెక్కలన్నీ సర్దార్ గబ్బర్ సింగ్ తో దాటేశాడట పవన్ కల్యాణ్. సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్… మొత్తంగా చూసుకుంటే… సర్దార్ సినిమాతో దాదాపు 33కోట్ల రూపాయలు వెనకేశాడని చెబుతున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు పవన్. చివరికి ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కూడా పవనే ఫైనలైజ్ చేశాడు. బెస్ట్ ఫ్రెండ్, నిర్మాత శరత్ మరార్ సహకారంతో… అన్ని డీల్స్ దగ్గరుండి పూర్తిచేశాడు. అలా సినిమాను ఎరోస్ కు 72 కోట్ల రూపాయలకు అమ్మేశాడట పవన్. తద్వారా తన ఫ్రెండ్, నిర్మాత శరత్ మరార్ ను సేఫ్ జోన్ లో పెట్టడంతో పాటు తను కూడా ఏకంగా 33 కోట్ల రూపాయలు సంపాదించాడని చెబుతున్నారు. మరోవైపు ఎరోస్ కు నష్టం రాకుండా ఉండేందుకు… సినిమా విడుదలైన తర్వాత కూడా తనే సొంతంగా సర్దార్ సినిమాకు ప్రమోషన్ కల్పించాలని పవన్ నిర్ణయించాడు.
First Published:  28 March 2016 6:18 AM GMT
Next Story