Telugu Global
Cinema & Entertainment

సర్దార్ ట్రయిలర్ పై ఎందుకంత మౌనం

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో… ఆ ట్రయిలర్ విడుదలైన తర్వాత కొన్ని అంచనాలు తగ్గాయనే చెప్పాలి. సినిమాపై అంచనాలకు, పవన్ స్టామినాకు తగ్గట్టు ట్రయిలర్ లేకపోవడమే దీనికి కారణం. మరోవైపు ఈ విషయంపై మెగా హీరోలు కూడా సైలెంట్ గా ఉండడం ట్రయిలర్ బాగాలేదనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. పవన్ కు సంబంధించి ఏ చిన్నది విడుదలైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పాటు సాయిధర్మతేజ, అల్లు శిరీష్, వరుణ్ […]

సర్దార్ ట్రయిలర్ పై ఎందుకంత మౌనం
X
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో… ఆ ట్రయిలర్ విడుదలైన తర్వాత కొన్ని అంచనాలు తగ్గాయనే చెప్పాలి. సినిమాపై అంచనాలకు, పవన్ స్టామినాకు తగ్గట్టు ట్రయిలర్ లేకపోవడమే దీనికి కారణం. మరోవైపు ఈ విషయంపై మెగా హీరోలు కూడా సైలెంట్ గా ఉండడం ట్రయిలర్ బాగాలేదనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. పవన్ కు సంబంధించి ఏ చిన్నది విడుదలైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో పాటు సాయిధర్మతేజ, అల్లు శిరీష్, వరుణ్ తేజ లాంటి హీరోలు సెల్ ఫోన్ కు పనిపెడతారు. సోషల్ నెట్ వర్కింగ్ లో ఏదో ఒక కామెంట్ పెడతారు. కానీ ఈసారి మాత్రం వీళ్లలో ఒక్కరు కూడా స్పందించలేదు. మొన్నటికి మొన్న క్షణం ట్రయిలర్ బాగుందని ట్వీట్ చేసిన బన్నీ కూడా సర్దార్ ట్రయిలర్ పై నోరు మెదపడం లేదు. ఓవైపు ట్రయిలర్ పై నెగెటివ్ కామెంట్స్ వస్తుంటే… మరోవైపు బాగుందని ట్వీట్ చేయడం అస్సలు బాగోదనే ఉద్దేశంలో మెగా హీరోలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ట్రయిలర్ కటింగ్ పర్యవేక్షణ కూడా పవన్ దే కావడంతో కామెంట్ చేయకుండా అంతా సైలెంట్ అయిపోయారు.
First Published:  28 March 2016 12:37 AM GMT
Next Story