Telugu Global
Cinema & Entertainment

బన్నీ చేయ‌లేని ప‌ని....అయాన్ చేశాడు!

అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ టైమ్‌లైన్‌లో ఈ మ‌ధ్యాహ్నం (మంగ‌ళవారం)  హ‌ఠాత్తుగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ టైటిట్ పాట ప్ర‌త్య‌క్ష‌మైంది. బ‌న్నీ ఆ పాటని ఎందుకు ట్వీట్ చేశాడో తెలియ‌క అంతా తెల్ల‌బోయారు. కాసేపాగాక బ‌న్నీ నుండి దానిపై వివ‌ర‌ణ వ‌చ్చింది. త‌ను కూడా షాక్‌కి గుర‌యిన‌ట్టుగా బ‌న్నీ ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఆ ప‌నిచేసింది తానుకాద‌ని, త‌న‌కుమారుడు బుల్లి అయాన్ అనీ అర్జున్ తెలిపాడు. తాను ఐఫోన్లో ఆ పాట‌లు వింటుండ‌గా అయాన్ ఈ ప‌నిచేశాడ‌ని, అత‌ను  […]

బన్నీ చేయ‌లేని ప‌ని....అయాన్ చేశాడు!
X

అల్లు అర్జున్ ట్విట్ట‌ర్ టైమ్‌లైన్‌లో ఈ మ‌ధ్యాహ్నం (మంగ‌ళవారం) హ‌ఠాత్తుగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ టైటిట్ పాట ప్ర‌త్య‌క్ష‌మైంది. బ‌న్నీ ఆ పాటని ఎందుకు ట్వీట్ చేశాడో తెలియ‌క అంతా తెల్ల‌బోయారు. కాసేపాగాక బ‌న్నీ నుండి దానిపై వివ‌ర‌ణ వ‌చ్చింది. త‌ను కూడా షాక్‌కి గుర‌యిన‌ట్టుగా బ‌న్నీ ట్వీట్ చేశాడు. ఎందుకంటే ఆ ప‌నిచేసింది తానుకాద‌ని, త‌న‌కుమారుడు బుల్లి అయాన్ అనీ అర్జున్ తెలిపాడు. తాను ఐఫోన్లో ఆ పాట‌లు వింటుండ‌గా అయాన్ ఈ ప‌నిచేశాడ‌ని, అత‌ను అలా ఎలా చేసిఉంటాడు అనేది త‌న‌కు అర్థం చేసుకోవ‌డానికే ప‌ది నిముషాలు ప‌ట్టింద‌ని, ఏదిఏమైనా ఇక‌పై అయాన్‌తో ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటాన‌ని చెప్పుకొచ్చాడు. త‌న భార్య స్నేహ కూడా, అది ప‌వ‌న్ క‌ల్యాణ్ పాట కాబ‌ట్టి స‌రిపోయింద‌ని, మ‌రొక‌రి పాట‌యితే ఇబ్బంది ప‌డేవారమ‌ని అన్న‌ట్టుగా తెలిపాడు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే దీనికి కొస‌మెరుపు ఏమిటంటే మెగా అభిమానులు అయాన్ మంచి ప‌ని చేశాడని అనుకుంటున్నారని స‌మాచారం. ఎందుకంటే గ‌త కొన్ని రోజులుగా బ‌న్నీ, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా గురించి పూర్తిగా మౌనం దాల్చాడు. ఏమీ మాట్లాడ‌టం లేదు. ఆడియో గురించి గానీ ట్రైల‌ర్ గురించి కానీ అత‌ని నుండి ఎలాంటి ట్వీట్లు లేవు. ఇది మెగా అభిమానుల‌ను కాస్త నిరుత్సాహానికి గురిచేసింది. ఇత‌ర మెగాహీరోలు చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌రమ్‌తేజ్‌లు ఎంతోకొంత స్పందించ‌గా బ‌న్నీ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో తండ్రి చేయ‌లేనిది కొడుకైనా చేశాడ‌ని అభిమానులు అనుకంటున్నార‌ట‌.

Click on Image to Read: (Photo Gallery)

Sreeja Marriage Photos (1)

srija1

First Published:  29 March 2016 4:45 AM GMT
Next Story