‘’ఏంటి భయ్యా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టున్నావ్’’- రేవంత్‌, కేటీఆర్ చిట్‌ చాట్

టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు వింటే చాలు టీఆర్ఎస్‌ నేతలు భగ్గుమంటుంటారు. కానీ ఈ మధ్య ఆ వాతావరణం కాస్త చల్లబడినట్టుగానే ఉంది. రేవంత్‌ రెడ్డి కూడా గతంలోలాగా దూకుడుగా కాకుండా ఒక పద్ధతిలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీల్లోని లిఫ్ట్ వద్ద కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎదురుపడ్డారు. ఎవరిదారిలో వారు వెళ్తారని అనుకున్నారు అందరూ. కానీ తొలుత నవ్వుతూ  కేటీఆరే పలకరించారు. ‘’ఏం బయ్యా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టున్నావ్ ?’’ అని నవ్వుతూ పలకరించారు. ‘’వెళ్లాలి కదా!. స్ట్రాటజీ లేకపోతే ఎలా అన్నా’’ అని రేవంత్ బదులిచ్చారు. దీంతో రేవంత్ భుజాన్ని తట్టి నవ్వుతూ కేటీఆర్ వెళ్లిపోయారు. ఇంతలోనే మంత్రి ఈటెల రాజేందర్ అక్కడికి వచ్చారు. మాజీ ప్రజాప్రతినిధుల పించన్‌ మొత్తం పెంచాలని  ఈటెలను రేవంత్ కోరారు. అయితే ‘’పక్క రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు రేవంత్‌…’’ అని ఈటెల ప్రశ్నించారు. అందుకు ‘’వారిది రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్. మనది 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ మనకి వారికి పోలికేంటన్నా’’ అని రేవంత్ ప్రశ్నించారు.

Click on Image to Read:

jagan jyoutula

chandrababu-naidu-rayalasee

bhuma1

jyotula-jagan-1

bhuma

ycp-mla eeshwari

jagan-assembly1213

jyotula-nehru

jd-laxminarayna

rajappa-jyotula

Aparna-Rao

bonda-roja

ysr-sai-pratap

jagan sai pratap

women

jc-raghuveera