పప్పు కోసమే సినిమాలు అడ్డుకుంటున్నారు – రోజా

ఏడాది పాటు తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై రోజా న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. తన సస్పెన్షన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ ముందు రోజా తరపు న్యాయవాది జైసింగ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. వచ్చే శుక్రవారం రోజా పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా… చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.

ఒకప్పుడు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి అవమానించిన చంద్రబాబు …ఇప్పుడు తిరిగి ఆయన విగ్రహాలకు పూలదండలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ను వెంటాడిన తరహాలోనే బాబు గ్యాంగ్  తనపైనా కక్షకట్టిందన్నారు. ఎన్టీఆర్ అన్న పేరు వింటేనే చంద్రబాబుకు మంటపుడుతుందన్నారు. అందుకే ఎన్టీఆర్‌ పేరు పెట్టి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని గాలికొదిలేశారన్నారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారని..  కానీ రెండేళ్లలో   750 కోట్ల బకాయి సొమ్ము మంజూరు చేయకుండా నిలిపేశారన్నారు.

చివరకు ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లో దూసుకెళ్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా రాజకీయంగా తొక్కేశారని రోజా ఆరోపించారు. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను వాడుకుని ఇప్పుడు కనీసం కార్యకర్తగా కూడా లేకుండా చేశారని విమర్శించారు. జూనియర్‌  ఎన్టీఆర్ పైకొస్తే తన కుమారుడు ముద్దపప్పుకు ఇబ్బందులు వస్తాయని కక్ష కట్టారని రో్జా అన్నారు. చివరకు జూ. ఎన్టీఆర్‌ సినిమాలు విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నది కూడా అందుకేనని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్‌ తరహాలోనే రోజాకు అహం ఎక్కువని టీడీపీ అనుకూల పత్రికలో కొత్తపలుకు రాసుకున్నారని … అది ఒక చెత్తపలుకు అని రోజా విమర్శించారు.  టీడీపీ ఇప్పుడు తెలుగుదొంగల పార్టీగా మారిందని రోజా ఎద్దేవా చేశారు.

Click on Image to Read:

jagan jyoutula

chandrababu-naidu-rayalasee

bhuma1

jyotula-jagan-1

ktr-revanth

bhuma

ycp-mla eeshwari

jagan-assembly1213

jyotula-nehru

jd-laxminarayna

rajappa-jyotula

Aparna-Rao

bonda-roja

ysr-sai-pratap

jagan sai pratap

women

jc-raghuveera