నో ఓటింగ్‌… మళ్లీ బురిడీ కొట్టించిన అధికారపక్షం

అధికార పార్టీ ఎత్తుల ముందు మరోసారి వైసీపీ బోర్లా పడింది. ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో ఓటింగ్‌ ద్వారా  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పనిపట్టాలనుకున్న ప్రతిపక్షానికి అధికార పక్షం మరోసారి షాక్ ఇచ్చింది.  ప్రతిపక్షం సరైన ముందస్తు వ్యూహంతో సిద్ధం కాకపోవడం కూడా అధికారపార్టీకి కలిసివచ్చింది. బిల్లుపై ఓటింగ్‌పై ప్రతిపక్షం పట్టుబట్టగా .. ఎప్పటిలాగే యనమల లేచి రూల్స్ చదివారు.  మొత్తం బిల్లుపై డివిజన్  అడిగే అధికారం ఎవరికీ లేదని యనమల చెప్పారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్ ఎక్కడా ఉండదన్నారు. డిమాండ్స్‌, కోత తీర్మానాల సమయంలోనూ ఓటింగ్‌ అడగాల్సి ఉంటుందన్నారు. కానీ ప్రతిపక్షానికి ఆ విషయం తెలియక.. డిమాండ్లు, కట్ మోషన్స్‌ సమయంలో మౌనంగా ఉందన్నారు. దాంతో డిమాండ్లు పాస్ అవడం, కట్‌ మోషన్స్ వీగిపోవడం జరిగిందని.. ఇక ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్‌ అవకాశం లేదన్నారు . అసలు ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్ జరిగిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. అసలు ఎప్పుడు ఓటింగ్ అడగాలో కూడా ప్రతిపక్షానికి తెలియదని ఎద్దేవా చేశారు.

యనయల వాదనపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ద్రవ్యవినిమయ బిల్లుపైనా ఓటింగ్ అడిగే అధికారం ప్రతిపక్షానికి ఉందని రూల్స్ చదివారు.  జోక్యం చేసుకున్న స్పీకర్… తాను ఉదయం రూల్స్ చదివానని, రాజ్యసభ, లోక్‌సభ నిపుణులతో మాట్లాడానని చెప్పారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్‌ అవసరం లేదన్నారు. ఇది తానిస్తూ రూలింగ్ అంటూ వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యే ఓటింగ్ లేకుండానే మూజువాణి ఓటుతో ద్రవ్యవినిమయ బిల్లును స్పీకర్ ఆమోదించారు. దీంతో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అధికారపక్షం ఈజీగా గండం నుంచి గట్టెక్కించింది.

Click on Image to Read:

kcr-cbn-in-assembly

srikanth-reddy

telangana-reddys

anilkumar-yadav

pocharam cbn

yanamala1

jagan jyoutula

chandrababu-naidu-rayalasee

shilpa

ktr-revanth

jd-laxminarayna

ysr-sai-pratap