Telugu Global
Cinema & Entertainment

సర్దార్ హిందీ పాటలు వచ్చేశాయి

తెలుగులో ఇప్పటికే సాంగ్స్ తో దుమ్ముదులుపుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు హిందీలోకి కూడా ఎంటరయ్యాడు. అవును… సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ పాటలు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఎరోస్ అధికారిక పోర్టల్ లో కూడా ఈ పాటల్ని వినొచ్చు. పాటల విడుదల సందర్భంగా మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ కొన్ని ఫొటోల్ని కూడా ట్విట్టర్ లో పెట్టాడు. హిందీ వెర్షన్ పాడిన గాయనీగాయకులు ఆ ఫొటోల్లో ఉన్నారు. బెన్నీ దయాల్, శ్రియా ఘోషల్, శ్వేతా పండిట్, విజయ్ […]

సర్దార్ హిందీ పాటలు వచ్చేశాయి
X

తెలుగులో ఇప్పటికే సాంగ్స్ తో దుమ్ముదులుపుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడు హిందీలోకి కూడా ఎంటరయ్యాడు. అవును… సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ పాటలు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఎరోస్ అధికారిక పోర్టల్ లో కూడా ఈ పాటల్ని వినొచ్చు. పాటల విడుదల సందర్భంగా మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ కొన్ని ఫొటోల్ని కూడా ట్విట్టర్ లో పెట్టాడు. హిందీ వెర్షన్ పాడిన గాయనీగాయకులు ఆ ఫొటోల్లో ఉన్నారు. బెన్నీ దయాల్, శ్రియా ఘోషల్, శ్వేతా పండిట్, విజయ్ ప్రకాష్… సర్దార్ హిందీ పాటల్ని ఆలపించారు. వీళ్లతో పాటు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా గొంతు కలపడం విశేషం. మరో 4 రోజుల్లో… బాలీవుడ్ లో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. హిందీ ప్రేక్షకుల్ని ఆకర్షించేలా… కాస్త విలక్షణంగా ప్రచారం కల్పించాలని యూనిట్ భావిస్తోంది. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా… హిందీలో 8వందల థియేటర్లలో విడుదలకాబోతోంది.

First Published:  30 March 2016 10:35 AM GMT
Next Story