Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ హీరోయిన్ తో రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ వరుస విజయాలకు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా అడ్డుకట్ట వేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ… రాజ్ తరుణ్ జోరు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మంచువిష్ణుతో కలిసి వీడో రకం, ఆడో రకం అనే సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. దీంతో పాటు త్వరలోనే నాని అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి సిద్ధమౌతున్నాడు. గతంలో సుకుమార్ వద్ద నాని అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ కాలంలోనే ఓ మంచి […]

ఫ్లాప్ హీరోయిన్ తో రాజ్ తరుణ్
X
రాజ్ తరుణ్ వరుస విజయాలకు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా అడ్డుకట్ట వేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ… రాజ్ తరుణ్ జోరు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మంచువిష్ణుతో కలిసి వీడో రకం, ఆడో రకం అనే సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. దీంతో పాటు త్వరలోనే నాని అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి సిద్ధమౌతున్నాడు. గతంలో సుకుమార్ వద్ద నాని అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ కాలంలోనే ఓ మంచి కథ రాసుకొని, రాజ్ తరుణ్ ను ఇంప్రెస్ చేశాడు. సినిమా కూడా సెట్ అయిపోయుంది. అంతా బాగానే ఉంది కానీ…. ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ అనే ముద్దుగుమ్మను తీసుకోవడమే అందరికీ డౌట్స్ పెంచేలా చేసింది. తాజాగా ఫ్లాప్ తో ఉన్న రాజ్ తరుణ్… మరో ఫ్లాప్ హీరోయిన్ ను తీసుకోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. తనకు వరుసగా హిట్స్ ఇచ్చిన అవికా గౌర్ ను మరోసారి రిపీట్ చేసి ఉంటే బాగుండేదని అంతా అనుకుంటున్నారు. గతంలో అనీషా ఆంబ్రోస్ అలియాస్ జానకి అనే సినిమా చేసింది. తాజాగా సందీప్ కిషన్ సరసన రన్ అనే సినిమా చేసింది.
First Published:  29 March 2016 11:17 PM GMT
Next Story