Telugu Global
Cinema & Entertainment

ఈ సారైన `తుపాకి` విజయ్ తూటా పేలుతుందా ?

త‌మిళ హీరో విజ‌య్ కు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎస్టాబ్లీష్ కాలేదనే చెప్పాలి. త‌న‌కంటే లేటుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆల్మోస్ట్ ఇక్కడ తెలుగు హీరోస్తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ర‌జ‌నీకాంత్ ఎప్పుడో తెలుగు హీరో అయ్యాడు అనేది తెలిసిందే. ఇక కుర్ర హీరోలు ఆర్యా, ధ‌నుష్ లు కూడా మంచి ఫాలోయింగ్ ను తెలుగు నాట సంపాదించుకోగ‌లిగారు కానీ.. విజ‌య్ మాత్రం ఇంకా ఇక్క‌డ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే ప‌నిలోనే వున్నాడు. విజ‌య్ […]

ఈ సారైన `తుపాకి` విజయ్ తూటా పేలుతుందా ?
X

త‌మిళ హీరో విజ‌య్ కు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎస్టాబ్లీష్ కాలేదనే చెప్పాలి. త‌న‌కంటే లేటుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆల్మోస్ట్ ఇక్కడ తెలుగు హీరోస్తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ర‌జ‌నీకాంత్ ఎప్పుడో తెలుగు హీరో అయ్యాడు అనేది తెలిసిందే. ఇక కుర్ర హీరోలు ఆర్యా, ధ‌నుష్ లు కూడా మంచి ఫాలోయింగ్ ను తెలుగు నాట సంపాదించుకోగ‌లిగారు కానీ.. విజ‌య్ మాత్రం ఇంకా ఇక్క‌డ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే ప‌నిలోనే వున్నాడు. విజ‌య్ న‌టించిన చిత్రాల్లో తెలుగు నాట రిలీజ్ అయినవీ త‌క్కువే. అందులో తుపాకి ఒక్క‌టే మంచి హిట్ అనే చెప్పాలి. ఆ సినిమా మాస్ అని చెప్పలేం… క్లాస్ అని చెప్పలేం. అయితే ఈ చిత్రం త‌రువాత విజ‌య్ న‌టించిన మ‌రో రెండు మూడు త‌మిళ చిత్రాలు ఇక్క‌డ డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. కానీ అవి ఏవి అంత‌గా న‌డ‌వ‌లేదు.

ఇకతాజాగా యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ.. తేరి అంటూ విజ‌య్ ను ఒక ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా ఒక చిత్రం తెర‌కెక్కించాడు. ఈసినిమా ఏప్రిల్ 15న రిలీజ్ చేయ‌డానికి త‌మిళ‌నాట స‌న్నాహాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో తెలుగులో కూడా డ‌బ్బ్ చేసి రిలీజ్ చేస్తార‌ని టాక్. అల్రేడి తేరి చిత్రం రైట్స్ ను మెగా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని పొలీసోడు పేరు తో తెలుగులో రిలీజ్ చేస్తార‌ని దిల్ రాజ్ క్యాంప్ నుంచి వినిపిస్తున్న స‌మాచారం.

First Published:  30 March 2016 2:27 AM GMT
Next Story