Telugu Global
Cinema & Entertainment

ఆయ‌న‌కు ప్లాటైపోయింద‌ట‌..!

సాధార‌ణంగా అందెగ‌త్తెల్ని చూసి అబ్బాయిలు ప్లాటైపోతుండ‌టం కామ‌న్. కానీ అబ్బాయిల్ని చూసి అమ్మాయిలు ప్లాటై పోవ‌డం అంటే విశేష‌మే. ఎందుకంటే వాళ్ల‌కు ఒక ప‌ట్టాన అబ్బాయి న‌చ్చ‌డం అంత తేలికైన విషయం కాదు కాబ‌ట్టి. అయితే బ్రిట‌న్ బ్యూటీ యామి జాక్సన్ త‌మిళ హీరో విజ‌య్ ను చూసి ప్లాటైపోయింద‌ట‌. ఆఫ్ కోర్స్ ఆయ‌న బ్యూటీకి కాదండోయ్. తేరి చిత్రంలో ఆయ‌న యాక్టింగ్ కు ఫిదా అయ్యింద‌ట‌. త‌మిళ యువ ద‌ర్శ‌కుడు అట్లీ విజ‌య్, స‌మంత‌, అమి జాక్స‌న్ […]

ఆయ‌న‌కు ప్లాటైపోయింద‌ట‌..!
X

సాధార‌ణంగా అందెగ‌త్తెల్ని చూసి అబ్బాయిలు ప్లాటైపోతుండ‌టం కామ‌న్. కానీ అబ్బాయిల్ని చూసి అమ్మాయిలు ప్లాటై పోవ‌డం అంటే విశేష‌మే. ఎందుకంటే వాళ్ల‌కు ఒక ప‌ట్టాన అబ్బాయి న‌చ్చ‌డం అంత తేలికైన విషయం కాదు కాబ‌ట్టి. అయితే బ్రిట‌న్ బ్యూటీ యామి జాక్సన్ త‌మిళ హీరో విజ‌య్ ను చూసి ప్లాటైపోయింద‌ట‌. ఆఫ్ కోర్స్ ఆయ‌న బ్యూటీకి కాదండోయ్. తేరి చిత్రంలో ఆయ‌న యాక్టింగ్ కు ఫిదా అయ్యింద‌ట‌. త‌మిళ యువ ద‌ర్శ‌కుడు అట్లీ విజ‌య్, స‌మంత‌, అమి జాక్స‌న్ లీడ్ రోల్స్ లో తేరి చిత్రం చేసిన విష‌యం తెలిసిందే.

ఉగాది త‌రువాత ఈ చిత్రాన్ని త‌మిళ , తెలుగ భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తల్లీ కూతుర్లు అనుబంధం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని, చిత్ర కథ వీరి చుట్టూనే తిరుగుతుందని సమాచారం. యామీ ఇందులో టీచర్‌గా కనిపించనున్నారట. షూటింగ్ లో విజ‌య్ సింగిల్ టేక్స్ చూసి అమి ఫిదా అయ్యింద‌ట‌. ఆయ‌న స‌ర‌స‌న ఒక చిత్ర‌మైన చేయాల‌ని ఎప్ప‌టి నుంచో క‌ల కంటుంద‌ట‌. అది తేరి చిత్రంతో నిజం అయ్యినందుకు ఈ ముద్దుగుమ్మ చాల ఖుషిగా ఉంది. ఇక ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రోబో 2.0 చిత్రంలో కూడా యామీ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

First Published:  31 March 2016 5:35 AM GMT
Next Story