Telugu Global
NEWS

బాలయ్య సినిమాలో డ్రీమ్ గర్ల్

బాలయ్య 100 చిత్రంలో నటీనటుల వేట వేగవంతమైంది. శాతవాహనరాజు గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితచరిత్రను యోధుడు పేరుతో భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా బాలయ్య వందో చిత్రం తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం టీంను కూడా సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. కథాపరంగా సినిమాలో తల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే ఆ పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటి కోసం అన్వేషించారు. ఇందుకోసం […]

బాలయ్య సినిమాలో డ్రీమ్ గర్ల్
X

బాలయ్య 100 చిత్రంలో నటీనటుల వేట వేగవంతమైంది. శాతవాహనరాజు గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితచరిత్రను యోధుడు పేరుతో భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా బాలయ్య వందో చిత్రం తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం టీంను కూడా సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. కథాపరంగా సినిమాలో తల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే ఆ పాత్రకు స్టార్ ఇమేజ్ ఉన్న నటి కోసం అన్వేషించారు. ఇందుకోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలినిని సంప్రదించారట. ఆమె అంగీకరిస్తే రాజమాత గౌతమి పాత్రకు హుందాతనంతో పాటు, గ్లామర్ కూడా యాడ్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఎలా స్పందిస్తుందో!. బాలయ్య వందో చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను డిసైడ్ చేసినట్టు ఇప్పటికే టాక్ నడుస్తోంది.

First Published:  31 March 2016 5:58 AM GMT
Next Story