అర్ధరాత్రి ఎంపీ కొత్తపల్లి గీత భర్త కిడ్నాప్‌ కలకలం

విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావును కొందరు నిర్బంధించడం కలకలం రేగింది. ఒక నిర్మాణ సంస్థ రామకోటేశ్వరరావును నిర్బంధించి కోట్లాది రూపాయల విలువైన భూములను రాయించుకుందని ఎంపీ గీత ఆరోపణ.

హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని తమ ఇంటి నుంచి బుధవారం సాయంత్రం రామకోటేశ్వరరావు బయటకు వెళ్లారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తులు ఆయన్ను కారులో ఓ హోటల్‌కు తీసుకెళ్లారు.   అదే సమయంలో భర్తకు ఫోన్‌ చేసేందుకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రయత్నించారు. అయినా ఆయన అందుబాటులోకి రాలేదు.

దీంతో అనుమానం వచ్చిన ఎంపీ గీత భర్త కారు డ్రైవర్‌కు ఫోన్‌ చేశారు. ఓ హోటల్‌లో కొందరు వ్యక్తులు రామకోటేశ్వరరావును హింసిస్తున్నారని డ్రైవర్‌ ఆమెకు తెలిపారట. దీంతో పోలీసు ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అర్థరాత్రి తర్వాత తనను కిడ్నాపర్లు కొండాపూర్‌లో వదిలేశారని రామకోటేశ్వరరావు నుంచి ఆమెను ఫోన్ కాల్ వచ్చింది.

గచ్చిబౌలిలో తమకు రూ. 75 కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమి ఉందని,  అభివృద్ధి చేసేందుకు దానిని రామకృష్ణ, సుధాకర్‌రావు అనే వ్యక్తులకు సంబంధించిన నిర్మాణ సంస్థకు ఇచ్చామన్నారు. నెలలు గడుస్తున్నా అట్నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఆమె చెప్పారు.

 తమ భూమిని సొంతం చేసుకునేందుకు రామకృష్ణ, సుధాకర్‌తోపాటు మరికొందరు వ్యక్తులు తన భర్తను కిడ్నాప్‌ చేశారని ఆమె చెబుతున్నారు. కిడ్నాప్‌ వెనక తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు సాయి హస్తం ఉందని ఆరోపించారు.

Click on Image to Read:

ys-jagan

talasani

ysrcp sarweswar rao

srikanth-reddy

anilkumar-yadav

kcr-cbn-in-assembly

speaker

telangana-reddys

pocharam cbn

yanamala1

chandrababu-naidu-rayalasee

ktr-revanth

jd-laxminarayna