Telugu Global
Cinema & Entertainment

సీనియర్ బాలయ్య‌ కోసం సీనియర్ హీరోయిన్ నే సెలెక్ట్ చేశారట‌

కొన్ని జంట‌ల‌కు ఆడియ‌న్స్ ఓటేస్తారు. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం చిత్రాల్లో బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌య‌న తార‌కు అలాగే ఓటేశారు. దీంతో బాల‌కృష్ట వందో సినిమాకు న‌య‌న‌తార‌ను తీసుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు క్రిష్ చేయ‌బోతున్న ఈ చిత్రం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అల్రేడి ప్రారంభం అయిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉగాదికి అధికారిక ప్ర‌క‌ట‌న వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాలు అభిమానుల్ని అల‌రించ‌డంతో.. ప్ర‌స్తుతం […]

సీనియర్ బాలయ్య‌ కోసం సీనియర్ హీరోయిన్ నే సెలెక్ట్ చేశారట‌
X

కొన్ని జంట‌ల‌కు ఆడియ‌న్స్ ఓటేస్తారు. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం చిత్రాల్లో బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌య‌న తార‌కు అలాగే ఓటేశారు. దీంతో బాల‌కృష్ట వందో సినిమాకు న‌య‌న‌తార‌ను తీసుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు క్రిష్ చేయ‌బోతున్న ఈ చిత్రం ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అల్రేడి ప్రారంభం అయిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఉగాదికి అధికారిక ప్ర‌క‌ట‌న వినిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాలు అభిమానుల్ని అల‌రించ‌డంతో.. ప్ర‌స్తుతం బాల‌య్య ఏజ్ కు న‌య‌నతార అయితే జోడి బాగా కుదురుతుంద‌నేది బాల‌య్య అభిప్రాయం అని తెలుస్తుంది. అయితే న‌య‌న తార సీనియ‌ర్ హీరోల స‌ర‌స‌న న‌టించ‌డానికి రెమ్యునరేష‌న్ విష‌యం లో ప్రొడ్యూస‌ర్ కు చుక్క‌లు చూపిస్తుంటుంది. ప్రస్తుత్తం ఈ అమ్మడు విక్టరీ వెంకటేశ్ తో పాటు చీరంజీవి 150వ సినిమాలో కూడా చేయబోతున్నట్టు టాక్. మ‌రి బాల‌య్య స‌ర‌స‌న మూడో సినిమాకు రెమ్యునరేష‌న్ ఎక్కువ డిమాండ్ చేస్తుందో లేక గ‌త రెండు చిత్రాల‌కు చేసిన‌ట్లు చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

First Published:  31 March 2016 1:56 AM GMT
Next Story