Telugu Global
WOMEN

భార‌తీయ మ‌హిళ‌ల‌కు న‌చ్చిన ప్ర‌దేశం...గోవా!

భార‌తీయ మ‌హిళ‌లు చూడాలని ఆశ‌ప‌డుతున్న ప్రాంతాల్లో  గోవా మొద‌టిస్థానంలో ఉంద‌ని  ఒక స‌ర్వేలో తేలింది. 1,215మందిని ఈ విష‌యంపై అడ‌గ్గా 70శాతం మంది గోవా త‌మకు అత్యంత ఇష్ట‌మైన టూరిజం స్పాట్‌ అని తెలిపారు. కుటుంబంతో కంటే త‌మ స్నేహితుల‌తో క‌లిసి విహార‌యాత్ర‌లకు వెళ్ల‌టం ఇష్ట‌మ‌ని చెప్పారు. ఆ త‌రువాత న‌చ్చిన ప్రాంతాల్లో అండ‌మాన్, రాజ‌స్థాన్‌లు ఉన్నాయి. థామ‌స్ కుక్ ఇండియా అనే డొమెస్టిక్ అండ్‌ స్పోర్ట్స్ టూరిజం సంస్థ ఈ స‌ర్వేని నిర్వ‌హించింది. ఈ  సంస్థ […]

భార‌తీయ మ‌హిళ‌లు చూడాలని ఆశ‌ప‌డుతున్న ప్రాంతాల్లో గోవా మొద‌టిస్థానంలో ఉంద‌ని ఒక స‌ర్వేలో తేలింది. 1,215మందిని ఈ విష‌యంపై అడ‌గ్గా 70శాతం మంది గోవా త‌మకు అత్యంత ఇష్ట‌మైన టూరిజం స్పాట్‌ అని తెలిపారు. కుటుంబంతో కంటే త‌మ స్నేహితుల‌తో క‌లిసి విహార‌యాత్ర‌లకు వెళ్ల‌టం ఇష్ట‌మ‌ని చెప్పారు. ఆ త‌రువాత న‌చ్చిన ప్రాంతాల్లో అండ‌మాన్, రాజ‌స్థాన్‌లు ఉన్నాయి. థామ‌స్ కుక్ ఇండియా అనే డొమెస్టిక్ అండ్‌ స్పోర్ట్స్ టూరిజం సంస్థ ఈ స‌ర్వేని నిర్వ‌హించింది.

ఈ సంస్థ విహార యాత్ర‌ల విషయంలో మ‌హిళ‌ల మ‌న‌సుల్లోని మాట‌ల‌ను క‌నిపెట్టేందుకు లోతైన అధ్య‌య‌నాలు చేసింది. 56శాతం మంది… హ‌డావుడిగా, జ‌నం ఉన్న టూరిస్టు ప్ర‌దేశాల‌కంటే తాము ఊహించ‌ని మార్గాల్లో, ఊహ‌కు అంద‌ని ప్ర‌దేశాల‌కు వెళ్ల‌టం ఇష్ట‌మ‌న్నారు.

78శాతం మంది ప్ర‌యాణాల్లో త‌మ‌కు ర‌క్ష‌ణ అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మ‌ని చెప్పారు. ఇండియాలో గోవా, ప్ర‌పంచంలో సింగ‌పూర్ మ‌హిళ‌ల‌కు సుర‌క్షిత‌మైన ప్రాంతాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. స‌ర్వేలో పాల్గొన్న భార‌త మ‌హిళల్లో చాలామంది, సింగ‌పూర్‌తో పాటు థాయ్‌ల్యాండ్‌, స్విట్జ‌ర్లాండ్‌, దుబాయి, శ్రీలంక‌, బాలీ (ఇండోనేషియా), అమెరికాలు త‌మ‌కు నచ్చిన టూరిస్టు ప్ర‌దేశాలని చెప్పారు.

First Published:  1 April 2016 6:19 AM GMT
Next Story