Telugu Global
NEWS

జగన్ కేసులో పస లేదా? మరొకరిపై విచారణ నిలిపివేత

జగన్‌ ఆస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా ఊరట లభిస్తోంది.  ఇప్పటికే జగన్ ఆస్తుల కేసు, ఎమార్‌ కేసుల్లో వరుసగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం, పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌పై విచారణను హైకోర్టు నిలిపివేసింది. తాజాగా జగన్ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతిపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. జగన్ కంపెనీలలో పెట్టుబడుల కేసులో ఇందూ- హౌసింగ్ బోర్డుకు మద్య జరిగిన ఒప్పందాలకు సంబందించి సిబిఐ దాఖలుచేసిన […]

జగన్ కేసులో పస లేదా? మరొకరిపై విచారణ నిలిపివేత
X

జగన్‌ ఆస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా ఊరట లభిస్తోంది. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసు, ఎమార్‌ కేసుల్లో వరుసగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం, పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌పై విచారణను హైకోర్టు నిలిపివేసింది. తాజాగా జగన్ ఆస్తుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి మహంతిపై విచారణను హైకోర్టు నిలిపివేసింది. జగన్ కంపెనీలలో పెట్టుబడుల కేసులో ఇందూ- హౌసింగ్ బోర్డుకు మద్య జరిగిన ఒప్పందాలకు సంబందించి సిబిఐ దాఖలుచేసిన కేసులో మహంతిని కూడా నిందితుడు గా పేర్కొన్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే తనపై విచారణను చాలెంజ్ చేస్తూ ఆయన హైకోర్టు ఆశ్రయించారు. జగన్ కేసులో ఇలా నిందితులకు వరుసగా ఊరట లభించడం ఆసక్తిగా ఉంది. అధికారులు, మంత్రులనే విచారణ నుంచి తప్పించాక… ఇక అప్పట్లో ఎలాంటి పదవిలో లేని జగన్‌పై కేసు ఎంతవరకు నిలబడుతుందన్నది ఆసక్తికరమే.

Click on Image to Read:

cbn-jagan1

cbn-modi

temple

jyothula-bhuma

jagan-chinta-mohan

jagan రkodela13

jagan-kodela

baligadu

First Published:  1 April 2016 1:34 AM GMT
Next Story