Telugu Global
Cinema & Entertainment

సెన్సార్ పూర్తిచేసుకున్న సర్దార్

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రెండు పాటలు మినహా మిగతా సినిమా మొత్తానికి సెన్సార్ పూర్తిచేశారు. ప్రస్తుతం రెండు పాటల్ని స్విట్జర్లాండ్ లో పూర్తిచేశారు. పాటల షూటింగ్ పూర్తిచేసుకున్న టీం… గురువారమే హైదరాబాద్ తిరిగొచ్చింది. మరో 2 రోజుల్లో ఆ పాటల ఎడిటింగ్ కూడా పూర్తిచేసి, టోటల్ సెన్సార్ ఫార్మాలిటీ ముగించేస్తారు. ఈ సినిమాను ఈనెల 8న ఉగాది కానుకగా గ్రాండ్ గా విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది […]

సెన్సార్ పూర్తిచేసుకున్న సర్దార్
X
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రెండు పాటలు మినహా మిగతా సినిమా మొత్తానికి సెన్సార్ పూర్తిచేశారు. ప్రస్తుతం రెండు పాటల్ని స్విట్జర్లాండ్ లో పూర్తిచేశారు. పాటల షూటింగ్ పూర్తిచేసుకున్న టీం… గురువారమే హైదరాబాద్ తిరిగొచ్చింది. మరో 2 రోజుల్లో ఆ పాటల ఎడిటింగ్ కూడా పూర్తిచేసి, టోటల్ సెన్సార్ ఫార్మాలిటీ ముగించేస్తారు. ఈ సినిమాను ఈనెల 8న ఉగాది కానుకగా గ్రాండ్ గా విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి…. ఈ వీకెండ్ నుంచి ప్రచారం మొదలుపెట్టాలనుకుంటున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటల్లో కొన్ని సూపర్ హిట్ అవ్వడంతో… సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఫస్ట్ టైమ్ తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో ఏకంగా 8వందల థియేటర్లలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
First Published:  31 March 2016 11:47 PM GMT
Next Story