Telugu Global
Cinema & Entertainment

బాహుబలిని సంప్రదించిన బాలయ్య

ప్రస్తుతం తన వందో సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు బాలకృష్ణ. ఉగాదికి ఈ సినిమాను ఏపీ నూతన రాజదాని అమరావతిలో ప్రకటించాలనుకుంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు యోధుడు అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా బయటకొచ్చింది. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా కాబట్టి… టెక్నికల్ గా హై-లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో…. అంతర్జాతీయ స్థాయి నిపుణుల్ని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు బాహుబలి టీంను సంప్రదించినట్టు తెలుస్తోంది. […]

బాహుబలిని సంప్రదించిన బాలయ్య
X

ప్రస్తుతం తన వందో సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు బాలకృష్ణ. ఉగాదికి ఈ సినిమాను ఏపీ నూతన రాజదాని అమరావతిలో ప్రకటించాలనుకుంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు యోధుడు అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా బయటకొచ్చింది. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా కాబట్టి… టెక్నికల్ గా హై-లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో…. అంతర్జాతీయ స్థాయి నిపుణుల్ని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు బాహుబలి టీంను సంప్రదించినట్టు తెలుస్తోంది. బాహుబలి సినిమాకు పనిచేస్తున్న బృందమే…. బాలయ్య వందో సినిమాకు కూడా పనిచేసే ఆవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే… బాహుబలి-2 సినిమా కంప్లీట్ అవ్వడానికి కనీసం మరో 7 నెలలైనా పడుతుంది. మరి అప్పటవరకు బాలయ్య వెయిట్ చేస్తాడా అనేది అనుమానం. లేకపోతే… మరో అంతర్జాతీయ టీంతో సెట్స్ పైకి వెళ్తాడా అనేది చూడాలి.

First Published:  1 April 2016 11:00 PM GMT
Next Story