Telugu Global
CRIME

స‌ల్మాన్ హెయిర్ స్ట‌యిల్ కాపురంలో చిచ్చు పెట్టింది..!

త‌న అభిమాన హీరోలా త‌యారవ్వాల‌నుకుంటే… జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని క‌ల‌లోనైనా ఊహించ‌డు ఆ అర్బ‌కుడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో చేడీలాల్ అనే యువ‌కుడు సల్మాన్‌ఖాన్ కు వీరాభిమాని. స‌ల్మాన్ లా ఉండేందుకు త‌పించేవాడు. ఈ మ‌ధ్య అచ్చం స‌ల్మాన్‌లా హెయిర్ స్ట‌యిల్ చేయించుకున్నాడు. మిత్రులు అంతా స‌ల్లూ భాయ్ అని పిల‌వ‌డంతో పొంగిపోయాడు. ఇంటికి వ‌చ్చాక‌.. అత‌ని భార్య  కూడా బాగున్నావు అంది. ప‌క్క‌నే ఉన్న మ‌ర‌ద‌లు కూడా బావ‌గారిని ఆకాశానికెత్తింది. ఇది చేడీలాల్ భార్య‌కు న‌చ్చ‌లేదు. నాభ‌ర్త‌ను […]

స‌ల్మాన్ హెయిర్ స్ట‌యిల్ కాపురంలో చిచ్చు పెట్టింది..!
X

త‌న అభిమాన హీరోలా త‌యారవ్వాల‌నుకుంటే… జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని క‌ల‌లోనైనా ఊహించ‌డు ఆ అర్బ‌కుడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నోలో చేడీలాల్ అనే యువ‌కుడు సల్మాన్‌ఖాన్ కు వీరాభిమాని. స‌ల్మాన్ లా ఉండేందుకు త‌పించేవాడు. ఈ మ‌ధ్య అచ్చం స‌ల్మాన్‌లా హెయిర్ స్ట‌యిల్ చేయించుకున్నాడు. మిత్రులు అంతా స‌ల్లూ భాయ్ అని పిల‌వ‌డంతో పొంగిపోయాడు. ఇంటికి వ‌చ్చాక‌.. అత‌ని భార్య కూడా బాగున్నావు అంది. ప‌క్క‌నే ఉన్న మ‌ర‌ద‌లు కూడా బావ‌గారిని ఆకాశానికెత్తింది. ఇది చేడీలాల్ భార్య‌కు న‌చ్చ‌లేదు. నాభ‌ర్త‌ను ఎందుకు పొగుడుతున్నావు? అంటూ అమె మీద‌కు లంఘించింది. దీంతో చేడీలాల్ క‌ల‌గ‌జేసుకుని భార్య‌ను ఆపాడు. దీన్ని చేడీలాల్ భార్య అవ‌మానంగా భావించింది. అంతే చేడీలాల్ నిద్రిస్తుండ‌గా క‌త్తెర‌తో అత‌ని జుట్టు మొత్తం క‌త్తిరించింది.

నిద్ర‌లేచిన‌ చేడీ అద్దంలో ముఖం చూసుకుని అదిరిప‌డ్డాడు. కోపంతో భార్య‌ను చిత‌క‌బాదాడు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన చేడీ భార్య ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు రైలు ప‌ట్టాల‌పై వెళ్లి ప‌డుకుంది. గ్రామ‌స్తులు వెళ్లి ర‌క్షించారు. క‌ట్ చేస్తే.. సీన్ పోలీస్ స్టేష‌న్‌కు మారింది. భార్య‌ను హింసించినందుకు చేడీని పోలీసులు అరెస్టు చేశారు. పాపం! తానెంతో మురిపెంగా చేయించుకున్న హెయిర్‌స్ట‌యిల్ త‌న కాపురంలో నిప్పులు పోసి, త‌న‌ను క‌ట‌క‌టాలు లెక్క‌బెట్టిస్తుంద‌ని ఊహించ‌లేక‌పోయాడు చేడీ! మ‌ర‌ద‌ళ్లు ఉన్న భ‌ర్త‌లారా బ‌హుప‌రాక్‌!
First Published:  1 April 2016 11:25 PM GMT
Next Story