ఎదురుగానే రాయపాటికి అంబటిబాబు పంచ్‌

గుంటూరులో ఆదివారం ఒక ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు  వైసీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు హాజరయ్యారు. ఈ సమయంలో ముగ్గురి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.  తొలుత  రాయపాటి … ఎమ్మెల్యే ముస్తఫాను గిల్లి చూశారు.  వైసీపీలో ఎందుకు గానీ… టీడీపీలోకి వచ్చేయ్‌ రాదూ అంటూ ప్రతిపాదించారు. అంతే కాదు టీడీపీలోకి వస్తే అన్నీ తాను చూసుకుంటానని  ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఇప్పించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని ఆఫర్ చేశారు.

దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ముస్తఫా మౌనంగా ఉండిపోయారు. దీంతో జోక్యం చేసుకున్న అంబటి రాంబాబు… రాయపాటిపై పంచ్ విసిరారు. ‘’ఇప్పుడెందుకు గానీ… వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే ఉంటే అప్పుడు వస్తాడులే’’ అని కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఏఏ నేతలు టీడీపీలో ఉంటారో అదీ కూడా చూద్దాం అంటూ అంబటి వ్యాఖ్యానించారు. దీంతో రాయపాటికి ఏం మాట్లాడాలో అర్థం రాలేదు.  టీడీపీ మళ్లీ గెలుస్తుందని ఆయన కూడా ధీమాగా చెప్పలేక  అటు ఇటు చూసి సైలెంట్ అయిపోయారు.

Click on Image to Read:

aishu

saritha-nair

nehru

india-map

dattu

jagan-raghuveera

jyothula-nehrurayapti

revanth-jagan-k

99

gali-janardhan

5

kodali-nani